జూన్ 18-22 మధ్య జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్‌తో ఆడేందుకు భారత జట్టు ఇంగ్లాండ్ వెళ్లనుంది. ఆ తర్వాత అక్కడే ఉండి ఆగస్టులో ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్ ఆడనుంది. కానీ ఈ మధ్యలో జులైలో బీసీసీఐ మరో టూర్‌ను ప్లాన్ చేసింది. గతేడాది కరోనా వాయిదా పడిన శ్రీలంక పర్యటనను తెరమీదకు తీసుకొచ్చింది. శ్రీలంక పర్యటనలో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. జూలై 13, 16, 19…
ఐపీఎల్ 2022 ను ఎనిమిది జట్లతో కాకుండా 10 జట్లతో నిర్వహిస్తామని ఈ ఏడాది ఆరంభంలో బోర్డు అధ్యక్షుడు గంగూలీ, కార్యదర్శి జై షా వెల్లడించారు. అలాగే 14వ సీజన్ ముగిశాక వీటి కోసం టెండర్లు పిలవాలని భావించారు. కానీ తాజాగా నెలకొన్న కరోనా పరిస్థితుల నేపథ్యంలో వచ్చే ఏడాది జరగాల్సిన మెగా ఆటగాళ్ల వేలం కూడా ఉండకపోవచ్చని, ఈ ఏడాది జరిగిన మినీ వేలం లాంటిదే నిర్వహించవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటికే ఐపీఎల్ 2021…
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌తో పాటు ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్ కోసం విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత పురుషుల క్రికెట్ జట్టు ఇంగ్లాండ్ టూర్‌కు వెళ్లనుంది. ఇందుకోసం 24 మందితో కూడిన జట్టును బీసీసీఐ ఇప్పటికే ఎంపిక చేసింది. మరోవైపు వచ్చే నెలలో మిథాలీ రాజ్, హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని భారత మహిళల క్రికెట్ టీమ్ కూడా మూడు ఫార్మాట్ల క్రికెట్ ఆడేందుకు ఇంగ్లండ్ టూర్‌కు వెళ్లనుంది. ప్రతి ఫార్మాట్‌కు 18 మందితో కూడిన…
హైదరాబాద్ లో ఐపీఎల్ మ్యాచులు నిర్వహించాలని బిసిసిఐని కోరామని హెచ్‌సీఏ ప్రెసిడెంట్ అజారుద్దీన్ పేర్కొన్నారు. అయితే.. సౌత్ లో రెండు వేదికలు ఉండడంతో హైదరాబాద్ లో మ్యాచ్ లు నిర్వహించడం లేదని కౌన్సిల్ లో నిర్ణయం తీసుకున్నారని తెలిసిందని పేర్కొన్నారు. హెచ్‌సీఏ అభివృద్ధి కోసం చాలా కష్టపడుతున్నామని.. ఒక్కసారిగా అభివృద్ధి కావాలంటే మ్యాజిక్ చేయాలా…? అని ఫైర్ అయ్యారు. నిధులు లేకపోతే అభివృద్ధి ఎక్కడ నుంచి కనిపిస్తుంది..? పాత అసోసియేషన్ టాక్స్ లను తాము చెల్లించామన్నారు. తెలంగాణలో…