దక్షిణ భారత దేశంలో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తుంది. కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్లో ఈ స్టేడియం ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది.
ఐపీఎల్ 17 వ సీజన్ ముగిసింది. ఈసారి విజేతగా కేకేఆర్ మూడోసారి టైటిల్ ను కైవసం చేసుకుంది. ఇక ఈ టోర్నమెంట్ లో కేకేఆర్ తరుపున బాగా పర్ఫర్మ్ చేసిన వారిలో టీమిండియా యువ సంచలనం రింకూ సింగ్ ఒకడు. ఇకపోతే ప్రస్తుతం భారీ ఫామ్‌లో ఉన్న ఈ ఆటగాడిని అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న పొట్టి ప్రపంచకప్ కు ఏమికా చేయలేదు బీసీసీఐ సెలక్షన్ కమిటీ. Kalki 2898 AD : ప్రభాస్…
BCCI Receives 3000 Applications for Team India Head Coach Job: టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం టీ20 ప్రపంచకప్ 2024తో ముగియనుంది. మరోసారి కోచ్‌గా బాధ్యతలు చేపట్టేందుకు ద్రవిడ్ సముఖంగా లేదు. దాంతో హెడ్ కోచ్ పదవి కోసం బీసీసీఐ ఈ నెల ఆరంభంలో నోటిఫికేషన్ రిలీజ్ చేయగా.. ఆఖరి గడువు (మే 27) ముగిసింది. హెడ్ కోచ్ పదవి కోసం ఏకంగా 3వేల దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. అందులో…
ప్రస్తుతం టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రావిడ్ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇక వారం రోజుల్లో మొదలు కాబోయే మెన్స్ టి20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత ఆయన పదవీకాలం ముగియనుంది. దీంతో తదుపరి కోచ్ కోసం బీసీసీఐ గత నెల రోజులను ముందు నుండే కసరత్తులను మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలోనే బిసిసిఐ కోచ్ పదవికి ఆశావాహుల నుండి అప్లికేషన్లను కూడా స్వీకరిస్తూ వస్తోంది. ప్రస్తుతం ఉన్న రాహుల్ ద్రావిడ్ పదవి కాలం ఇదివరకే ముగిసినప్పటికీ., ఆయన పదవి…
టీమిండియా కోచ్ పదవిని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ తిరస్కరించాడు. అందుకు గల కారణాలను ఆయన వెల్లడించాడు. నేషనల్ టీమ్‌తో కలిసి సీనియర్ కోచ్‌గా పని చేయాలని ఆసక్తి ఉందని చెప్పాడు.. కానీ ఓ కారణంతో బీసీసీఐ ఆఫర్‌కు నో చెప్పినట్లు రికీ పాంటింగ్ తెలిపాడు. భారత జట్టుకు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు అందుకున్న తర్వాత తన ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడపలేమో అన్న ఆలోచనతో కోచ్ పదవిని తిరస్కరించానని చెప్పాడు. ద్రవిడ్‌ను కోచ్‌గా కొనసాగమని…
టీ20 ప్రపంచకప్ 2024తో రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగుస్తుంది. దీంతో కొత్త హెడ్ కోచ్ కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. ద్రవిడ్ కొనసాగే అవకాశం లేని నేపథ్యంలో ప్రధాన కోచ్ ఎవరవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు ప్రక్రియ మే 27న ముగుస్తుంది. ఈ క్రమంలో టీమ్ ఇండియా ప్రధాన కోచ్‌గా ఉండాలని భారత మాజీ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ గౌతమ్ గంభీర్‌ను బీసీసీఐ కోరినట్లు తెలిసింది.
భారత ఫుట్‌బాల్ లెజెండ్ సునీల్ ఛెత్రి 19 సంవత్సరాల అంతర్జాతీయ కెరీర్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించిన వెంటనే, క్రీడా ప్రపంచంలో చాలా మంది భారత ఫుట్‌బాల్ లెజెండ్ ను గౌరవించడానికి, అభినదించడానికి ముందుకు వచ్చాయి. ఛెత్రి తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలలో 10 నిమిషాల వీడియోతో పదవీ విరమణ ప్రకటించాడు. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించడానికి తనను మొదటిసారి పిలిచిన సమయంలో తన కెరీర్ సమయం ఇక ఫుట్‌బాల్ కు కేటాయించాలనే తన నిర్ణయాన్ని గుర్తు…
Rohit Sharma Wanted Hardik Pandya Dropped from T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024కు ఎంపికైన భారత జట్టు గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను జట్టుకు ఎంపిక చేయవద్దని కెప్టెన్ రోహిత్ శర్మ, ఛీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌లు బీసీసీఐకి సూచించారని ఓ జాతీయ వెబ్సైట్ తమ కథనంలో పేర్కొంది. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో పాటు సెలెక్టర్లు రోహిత్ సూచనలను పట్టించుకోలేదట. దాంతో హార్దిక్ జట్టుకు…
BCCI invites applications for the position of Team India Head Coach: టీమిండియా మెన్స్ సీనియర్ హెడ్ కోచ్ పదవికి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సోమవారం దరఖాస్తులను ఆహ్వానించింది. హెడ్ కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకునే వారు మే 27న సాయంత్రం 6 గంటల లోపు బీసీసీఐ ఇచ్చిన లింక్‌లో తమ డీటెయిల్స్ సమర్పించాలి. ఎంపిక ప్రక్రియలో భాగంగా షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు.. దరఖాస్తుల సమగ్ర సమీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూలు…