Team India Coach: టీమిండియా కోచ్ ప్రకటన ఆలస్యం.. అసలు కారణం ఏంటంటే?
- ద్రవిడ్ పదవీకాలం ముగిసింది
- ఇప్పటికే ఇంటర్వ్యూ ప్రాసెస్ పూర్తయింది
- జీతభత్యాల విషయంలో చర్చలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Why BCCI is delaying India’s New Head Coach announcement: టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం టీ20 ప్రపంచకప్ 2024తో ముగిసింది. వాస్తవానికి గత సెప్టెంబర్‌లోనే ద్రవిడ్ పదవి కాలం ముగియగా.. కెప్టెన్ రోహిత్ శర్మ విజ్ఞప్తితో టీ20 ప్రపంచకప్ వరకు కొనసాగాడు. ఇక త్వరలోనే కొత్త హెడ్ కోచ్‌ను బీసీసీఐ నియమించనుంది. జులై చివరలో శ్రీలంకతో ప్రారంభమయ్యే టీ20, వన్డేల సిరీస్‌లకు కొత్త కోచ్ అందుబాటులో ఉంటాడని ఇప్పటికే బీసీసీఐ కార్యదర్శి జై షా స్పష్టం చేశారు.
టీమిండియా కోచ్ కోసం ఇప్పటికే ఇంటర్వ్యూ ప్రాసెస్ పూర్తయింది. ఇంటర్వ్యూ కోసం భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్‌తో పాటుగా భారత మహిళా జట్టు కోచ్‌గా పనిచేసిన డబ్ల్యూవీ రామన్ కూడా హాజరయ్యారు. అయితే బీసీసీఐ గంభీర్ వైపే మొగ్గుచూపిందని తెలుస్తోంది. త్వరలోనే గంభీర్‌ను హెడ్ కోచ్‌గా నియమిస్తారని సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం జీతభత్యాల విషయంలో బీసీసీఐ, గంభీర్‌ల మధ్య చర్చలు జరుగుతున్నాయని సమాచారం. అందుకే అధికారిక ప్రకటన ఆలస్యమవుతోందని తెలుస్తోంది.
Also Read
- IND vs SL: భారత్-శ్రీలంక సిరీస్‌లో కీలక మార్పు.. మ్యాచ్ వేదిక తరలింపు.? అసలేమైంది..
- Abhijit Dipke: "రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి".. విమానంలో అభిజీత్ దిప్కే హల్చల్
- CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
- Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
Also Read: Virat Kohli Pub: విరాట్ కోహ్లీ పబ్‌పై కేసు నమోదు!
జులై 27 నుంచి శ్రీలంక, భారత్ మధ్య మూడు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ లోపు కొత్త హెడ్ కోచ్ ప్రకటన వెలువడే అవకాశం ఉంది. సహాయక కోచ్‌ల ఎంపిక విషయంలో కూడా గౌతమ్ గంభీర్‌కు బీసీసీఐ పూర్తిస్వేచ్ఛ ఇచ్చిందని సమాచారం. గౌతీ మార్గనిర్ధేశంలో కేకేఆర్ టీమ్ ఐపీఎల్ 2024 టైటిల్ గెలిచిన విషయం తెలిసిందే. ఆటగాడిగా 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ గంభీర్‌గెలిచిన విషయం తెలిసిందే. ఇక సారథిగా కేకేఆర్ జట్టుకు రెండు టైటిల్స్ అందించాడు.
తాజావార్తలు
-
IND vs SL: భారత్-శ్రీలంక సిరీస్‌లో కీలక మార్పు.. మ్యాచ్ వేదిక తరలింపు.? అసలేమైంది..
-
Abhijit Dipke: “రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి”.. విమానంలో అభిజీత్ దిప్కే హల్చల్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
-
Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
ట్రెండింగ్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!