ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని అప్రమత్తంగా వుండాలని సూచించింది. ప్రస్తుతం అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడగా, ఈ నెల 9న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తం కొనసాగుతోందని, ఈ నెల 9 నాటికి అది అల్పపీడనంగా మారనుందని వివరించింది. క్రమేపీ అది బలపడి వాయువ్య దిశగా పయనిస్తుందని, దీని…
తెలంగాణలోని పలు ప్రాంతాలలో బుధవారం భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలో కొమరీన్ ప్రాంతంపై అల్పపీడనం ఆవరించి ఉందని, దీని నుంచి తమిళనాడు తీరం వరకు గాలులతో కూడిన ఉపరితల ద్రోణి ఏర్పడినట్లు తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలో ఈరోజు భారీ వర్షాలు, గురువారం నుంచి మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం సూచించింది. Read Also: కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డిని స్తంభానికి కట్టేసిందెవరు? మరోవైపు…
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీలో అక్కడక్కడా భారీ వర్షాలు పడుతున్నాయి. టెంపుల్ సిటీ తిరుపతి జలసంద్రమయింది. తిరుపతి లో భారీ వర్షం కారణంగా చెరువుల మారుతున్నాయి కాలనీలు. తిరుపతి నడిబొడ్డున ఉన్న మధురానగర్ లో వర్షం వల్ల కాలనీలో నీరు నిలిచిపోయింది. లోతట్టుప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇళ్ళలోంచి రాలేని పరిస్థితి నెలకొంది. నిత్యావసరాలు కూడా బయటకు వెళ్ళి కొనుక్కోలేని విధంగా వుంది. అధికారులు తమకు సాయం చేయాలని కాలనీల వాసులు కోరుతున్నారు.
నైరుతి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు, శ్రీలంక తీరప్రాంతం సమీపంలో ఏర్పడిన ఈ అల్పపీడనంతో పాటు బంగాళాఖాతంలో నవంబర్ 6న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని ఐఎండీ తెలిపింది. ఈ అల్పపీడనం క్రమంగా బలపడి తుఫానుగా మారే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అల్పపీడనం మరో 3-4 రోజుల్లో పశ్చిమ దిశగా ప్రయాణించి బలహీనపడే అవకాశాలు ఎక్కువగా వున్నాయి. ఉత్తరాంధ్ర తీరంలో ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తన కొనసాగుతోంది. ఈ…
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాలను అనుకుని అల్పపీడనం కొనసాగుతోంది.. దాని ప్రభావంతో ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది.. ఇక, కోస్తాలో మోస్తరు వానలు కురిసే అవకాశం ఉండగా.. తీరం వెంబడి గంటకు గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారుల వేటపై నిషేధం విధించినట్టు అధికారులు వెల్లడించారు. మరోవైపు ఈ అల్పపీడన ప్రభావంతో తూర్పు గోదావరి జిల్లా యంత్రాంగం అలెర్ట్ అయ్యింది.. జిల్లాలోని 13…
ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. తెలంగాణలో విస్తారంగా.. కొన్ని ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతుండగా.. ఏపీలోనూ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి.. అయితే, బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది వాతావరణశాఖ.. ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో ఈనెల 11న ఏర్పడే అవకాశం ఉందని.. కోస్తా ప్రాంతానికి ఎల్లో మెస్సేజ్ హెచ్చరికలు జారీ చేసింది. నిన్న ఏర్పడిన అల్పపీడనం బలపడి ఈరోజు దక్షిణ ఛత్తీస్‌గఢ్ మరియు దక్షిణ ఒడిశా ప్రాంతాలలో కొనసాగుతోందని..…
సముద్రతీరంలో అలలు ఎలా విరుచుకుపడుతుంటాయో చెప్పక్కర్లేదు. మామూలు సమయాల్లో కూడా అలలు పెద్ద ఎత్తున విరుచుకుపడుతుంటాయి. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ, విశాఖ జిల్లా భీమిలి, శ్రీకాకుళం జిల్లాలోని తీరప్రాంతాల్లోని సముద్రపు అలలు పెద్ద ఎత్తున విరుచుకుపడుతుంటాయి. అయితే, మంగళవారం రోజున రాజోలు నుంచి సముద్రంలోని 156 కిమీ దూరంలో భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత 5.1 గా నమోదైన సంగతి తెలిసిందే. ఈ భూకంపం తరువాత సముద్రంలో సడెన్‌గా మార్పులు కనిపించాయి. ఎప్పుడు అలలతో…
తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేదిలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. పెద్ద ఎత్తున సముద్రంలో అలలు ఎగసిపడుతున్నాయి. దీంతో సముద్రం 15 మీటర్ల మేర ముందుకు వచ్చింది. అలలు పెద్ద ఎత్తున ఎగసిపడటంతో పాటుగా సముద్రం ముందుకు చొచ్చుకు రావడంతో బీచ్ లో ఉన్నా దుకాణాలు నేలమట్టం అయ్యాయి. సముద్రం ఉగ్రరూపం దాల్చడంతో స్థానికులు భయాందోళనలు చెందుతున్నారు. గత కొన్ని రోజులుగా వాతావరణంలో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకుంటుండటంతో సముద్రం అల్లకల్లోలంగా మారినట్టు వాతావారణశాఖ పేర్కొన్నది. మత్స్యకారులు చేపల…