బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీలో అక్కడక్కడా భారీ వర్షాలు పడుతున్నాయి. టెంపుల్ సిటీ తిరుపతి జలసంద్రమయింది. తిరుపతి లో భారీ వర్షం కారణంగా చెరువుల మారుతున్నాయి కాలనీలు.
తిరుపతి నడిబొడ్డున ఉన్న మధురానగర్ లో వర్షం వల్ల కాలనీలో నీరు నిలిచిపోయింది. లోతట్టుప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇళ్ళలోంచి రాలేని పరిస్థితి నెలకొంది. నిత్యావసరాలు కూడా బయటకు వెళ్ళి కొనుక్కోలేని విధంగా వుంది. అధికారులు తమకు సాయం చేయాలని కాలనీల వాసులు కోరుతున్నారు.