Cyclone threat to AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్ర రాష్ట్రానికి తుపాను ముప్పు పొంచి ఉంది. దక్షిణ అండమాన్, మలక్కా జలసంధి పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనం.. పశ్చిమ-వాయవ్య దిశగా పయనించి రేపటికి వాయుగుండంగా మారుతుందని అమరావతి వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఆపై వాయవ్య దిశగా కదిలి.. డిసెంబర్ 2 వరకు ఆగ్నేయ బంగాళాఖాతంలో తుపానుగా బలపడే అవకాశముందని పేర్కొంది. డిసెంబర్ మొదటి వారంలో తుపాను తీరం దాటొచ్చని అమరావతి వాతావరణ శాఖ…
Rains in AP for three days Due to Low pressure in Bay of Bengal: ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ సమీపంలోని మలక్కా జలసంధి ప్రాంతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ.. బుధవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. మరో 48 గంటల్లో తుపానుగా…
Cyclone Midhili: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మరో 24 గంటల్లో తుఫానుగా మారుతుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. తుఫానుగా మారిన తర్వాత బంగ్లాదేశ్ లో తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది. బలమైన అల్పపీడనం ఉత్తర-ఈశాన్య దిశగా గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని, ఇది తుఫానుగా మారిన తర్వాత ‘మిధిలీ’గా పేరు పెట్టనున్నట్లు ఐఎండీ తెలిపింది. ఈ పేరున మాల్దీవులు సూచించింది. మిధిలీ తుఫాన్ శనివారం ఉదయం బంగ్లాదేశ్ లోని ఖేపుపరా, మోంగ్లా…
Low Pressure in Bay of Bengal: బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు అమరావతి వాతావరణ కేంద్రం సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మంగళవారం (నవంబర్ 14) ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో నవంబర్ 16 నాటికి వాయుగుండంగా బలపడనుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. Also Read: Guvvala Balaraju: మరోసారి ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై దాడి…
Hamoon Cyclone: తూర్పు తీరానికి తుఫాన్ ప్రమాదం పొంచింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం సాయంత్రానికి తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ఓ ప్రకటనలో తెలిపింది.
చంద్రయాన్ 3 తో జాబిల్లి రహస్యాలను తెలుసుకోనున్న భారత్ అంతరిక్షం గుట్టు మాత్రేమే కాదు లోతైన సముద్రం రహస్యలను కూడా తెలుసుకునేందుకు సిద్దమవుతుంది. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, జపాన్, ఫ్రాన్స్, చైనా మాత్రమే కలిగి ఉన్న మానవసహిత జలాంతర్గాములును భారత్ కూడా అభివృద్ధి చేయనుంది. సముద్రయాన్ మిషన్ పేరుతో సముద్రం అడుగున 6 వేల మీటర్ల లోతుకు జలాంతర్గామిని పంపనున్నారు. ఈ ప్రాజెక్ట్ లో కీలకం జలాంతర్గామి మత్స్య-6000. ప్రస్తుతం దీని పనులు చివరి దశలో…
Rains To Fall in AP and Telangana due to Low Pressure in Bay of Bengal: 5 రోజుల క్రితం బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం శుక్రవారం (ఆగష్టు 18) నాటికి అల్పపీడనంగా మారనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్పపీడన ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశముందని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే కొన్ని చోట్ల వర్షాలు కురియగా.. ఆకాశం మొత్తం మేఘావృతం అయి…
శనివారం బంగాళాఖాతంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.4గా నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ అందించిన సమాచారం మేరకు.. శనివారం మధ్యాహ్నం 2:39 గంటలకు భూకంపం సంభవించింది.