Matsya 6000: సముద్రయాన్..మరో ఘనత సాధించడానికి సిద్ధమవుతున్న భారత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చంద్రయాన్ 3 తో జాబిల్లి రహస్యాలను తెలుసుకోనున్న భారత్ అంతరిక్షం గుట్టు మాత్రేమే కాదు లోతైన సముద్రం రహస్యలను కూడా తెలుసుకునేందుకు సిద్దమవుతుంది. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, జపాన్, ఫ్రాన్స్, చైనా మాత్రమే కలిగి ఉన్న మానవసహిత జలాంతర్గాములును భారత్ కూడా అభివృద్ధి చేయనుంది. సముద్రయాన్ మిషన్ పేరుతో సముద్రం అడుగున 6 వేల మీటర్ల లోతుకు జలాంతర్గామిని పంపనున్నారు. ఈ ప్రాజెక్ట్ లో కీలకం జలాంతర్గామి మత్స్య-6000. ప్రస్తుతం దీని పనులు చివరి దశలో ఉన్నాయి. దీనిని చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ అభివృద్ధి చేస్తోంది. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది దేశంలోనే మొట్టమొదటి మానవసహిత సముద్ర అన్వేషణ మిషన్. ఈ సబ్ మెర్సిబుల్ ఫొటోలు, వీడియోలను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది సముద్రగర్భ అన్వేషణకు తోడ్పడే మానవసహిత జలాంతర్గామి అని ఆయన తెలిపారు.
Also Read
- Nepal Floods: నేపాల్ విలయం.. కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లిన 400 మంది గల్లంతు..
- LPG e-KYCపై కీలక అప్డేట్.. లాస్ట్ డెడ్‌లైన్ ఇదే..! గ్యాస్ కనెక్షన్‌కే ఎసరు..?
- Trump: ఇరాన్‌పై దాడికి తులసీ గబ్బార్డ్ చెప్పింది ఇదేనా! అయినా ట్రంప్ ఎందుకు ముందుకెళ్లారు?
- IND vs SL: చరిత్ర సృష్టించిన సోనల్ దినూష.. 15 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు
ఈ జలాంతర్గామిలో ముగ్గురు కూర్చొని 6 కిలోమీటర్ల సముద్రపు లోతుకు చేరుకోవచ్చు.ఇది మొదటగా 500 మీటర్ల మేర నీటి అడుగులకు ప్రయాణం చేయనుంది. తరువాత ఆక్వానాట్ లు సముద్రంలో 6,000 మీటర్ల లోతుకు వెళ్లేందుకు వీలుగా గోళాకార సబ్ మెరైన్ ను నిర్మిస్తున్నారు. ఈ మిషన్ ద్వారా సముద్ర గర్భ రహస్యాలను చేధించే అవకాశం ఉంది. సముద్ర వనరులు, జీవవైవిధ్యం మీద అధ్యయనం చేయడమే కాకుండా కోబాల్డ్, నికెల్, మాంగనీస్ వంటి విలువైన లోహాలు, ఖనిజాల గురించి అన్వేషించడానికి ఈ మిషన్ ఎంతో ఉపయోగపడుతుంది. ఆ సబ్ మెర్సిబుల్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన కిరణ్ రిజిజు దానిలో కూర్చొన్నారు. దాని గురించి పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. దీని ద్వారా సముద్ర వనరుల వివరాలు తెలుసుకొని ఆర్థికవృద్ధి సాధించాలని ప్రభుత్వం భావిస్తుంది. అంతేకాకుండా దీని ద్వారా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. ఇక దీని ద్వారా చెన్నై తీరంలోని బంగాళఖాతంలోకి 2024 లేదా 2025లో ముగ్గురు ఆక్వానాట్స్‌ను పంపించనున్నారు.
Next is “Samudrayaan”
This is ‘MATSYA 6000’ submersible under construction at National Institute of Ocean Technology at Chennai. India’s first manned Deep Ocean Mission ‘Samudrayaan’ plans to send 3 humans in 6-km ocean depth in a submersible, to study the deep sea resources and… pic.twitter.com/aHuR56esi7— Kiren Rijiju (@KirenRijiju) September 11, 2023
తాజావార్తలు
-
New Cyber Fraud : ఫోన్ పోయిందా.? ఖాతా ఖాళీ చేసే కొత్త మోసం.!
-
Nepal Floods: నేపాల్ విలయం.. కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లిన 400 మంది గల్లంతు..
-
LPG e-KYCపై కీలక అప్డేట్.. లాస్ట్ డెడ్‌లైన్ ఇదే..! గ్యాస్ కనెక్షన్‌కే ఎసరు..?
-
King 100: బాక్సాఫీస్ షేక్ అయ్యేలా నాగ్ 100వ సినిమా.. మళ్లీ టబుతో రొమాన్స్!
-
Trump: ఇరాన్‌పై దాడికి తులసీ గబ్బార్డ్ చెప్పింది ఇదేనా! అయినా ట్రంప్ ఎందుకు ముందుకెళ్లారు?
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..