Bathukamma: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ సందడి నిన్న మిన్నంటేలా మొదలైంది. ఆడబిడ్డలు ఆనందోత్సాహాలతో ఆటపాటలతో పూల పండగ చేసుకుంటున్నారు. సాయంత్రం అవుతోందంటే చాలు చక్కగా ముస్తాబై వాడవాడలా వీధివీధినా కోలాటాలతో కోలాహలంగా వేడుకను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వయసుతో సంబంధం లేకుండా చిన్నారుల నుంచి ముదుసలి వరకు అందరూ ఈ ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.