మన శరీరంలోని వ్యర్థాలను వడపోసి, రక్తాన్ని శుద్ధి చేసే అత్యంత ముఖ్యమైన అవయవాలు కిడ్నీలు. శరీరంలోని నీటి సమతుల్యతను కాపాడటం, టాక్సిన్స్‌ను బయటకు పంపడం, రక్తపోటును నియంత్రించడం వంటి కీలక బాధ్యతలు కిడ్నీలవే. కిడ్నీలు సక్రమంగా పనిచేయాలంటే రోజూ తగినంత నీరు తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే కేవలం నీరు మాత్రమే కాకుండా, కిడ్నీల పనితీరును మెరుగుపరచి, కిడ్నీల్లో రాళ్లు ఏర్పడకుండా నివారించడంలో సహాయపడే కొన్ని ప్రత్యేకమైన పానీయాలు కూడా ఉన్నాయి. ఇవి ఇప్పటికే ఉన్న…
భారతదేశంలో డయాబెటిస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ వ్యాధిని పూర్తిగా నయం చేయలేనప్పటికీ, సరైన ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, వైద్యుల సూచనప్రకారం మందులు తీసుకోవడం ద్వారా దీన్ని సమర్థవంతంగా నియంత్రించవచ్చు. ఈ నేపథ్యంలో, బార్లీ నీరు (జావ నీరు) డయాబెటిస్ నియంత్రణలో సహజమైన, ఉపయోగకరమైన పానీయం గా వైద్య నిపుణులు సూచిస్తున్నారు. బార్లీలో ఉండే కరిగే ఫైబర్ రక్తంలో గ్లూకోజ్ శోషణను నెమ్మదింపజేసి చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది.…