ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. వరుసగా జిల్లాల్లో పర్యటిస్తున్నారు.. వివిధ వర్గాలకు శుభవార్త చెబుతూ.. సంక్షేమ పథకాలకు సంబంధించిన డబ్బులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తూనే ఉన్నారు.. ఇక, ఇప్పుడు విద్యార్థులకు శుభవార్త చెప్పారు సీఎం జగన్.. 8వ తరగతి విద్యార్ధులకు ట్యాబ్‌లు పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు.. రేపు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో పర్యటించనున్న ఆయన.. విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీని ప్రారంభిస్తారు.. ఇక, ఈ నెల 22వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లలోని…
సాధారణంగా వీకెండ్ సెలవులు వస్తే ఎవరైనా ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తారు. దీనికి చిన్నా, పెద్ద అనే తేడా ఉండదు. అయితే ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు మాత్రం వీకెండ్ సెలవులలో ఇంట్లో సేదతీరకుండా పొలం వైపు అడుగులు వేశారు. ఏపీలోని బాపట్ల జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఇద్దరూ తమ భార్యాపిల్లలతో కలిసి పొలంలో చెమట చిందించారు. రైతులతో పాటు వీళ్లు కూడా పొలంలో పనిచేశారు. ఈ సందర్భంగా బాపట్ల మండలం…
జగనన్న విద్యా దీవెన నగదు విడుదల చేయడానికి సిద్ధమయ్యారు సీఎం వైఎస్ జగన్.. ఈ రోజు బాపట్లలో పర్యటించనున్న ఆయన.. జగనన్న విద్యా దీవెన మూడో త్రైమాసిక నగదు బదిలీ కార్యక్రమంలో పాల్గొంటారు..
సంక్షేమ పథకాలతో దూసుకుపోతోన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. మరో గుడ్‌న్యూస్ చెప్పారు.. కొన్ని ఇబ్బందులున్నా పథకాలకు సమయానికి అమలు చేస్తూనే కొత్త పథకాలకు శ్రీకారం చుడుతూ వస్తున్నారు.. ఇక, పాత పథకాలకు చెప్పిన షెడ్యూల్ ప్రకారం విడతల వారీగా నగదు జమ చేస్తున్నారు. ఇందులో భాగంగా విద్యా దీవెన నగదు విడుదల చేయడానికి సిద్ధమయ్యారు సీఎం వైఎస్ జగన్.. రేపు బాపట్ల జిల్లాలో పర్యటించనున్న ఆయన.. జగనన్న విద్యా దీవెన మూడో త్రైమాసిక…
Guntur Politics: జిల్లాల విభజన తర్వాత ఉమ్మడి గుంటూరు జిల్లా.. పల్నాడు, బాపట్ల, గుంటూరుగా విడిపోయింది. దానికంటే ముందుగానే గుంటూరు, నరసరావుపే, బాపట్ల లోక్‌సభ పరిధిలో కమిటీలను విభజించేశాయి ప్రధాన పార్టీలు. ఈ మార్పులు.. చేర్పులు తర్వాత పార్టీ నేతల వైఖరిలోనూ ఛేంజ్ కనిపిస్తోంది. ఒకప్పుడు ఉమ్మడి జిల్లాలో కలిసి మెలిసి తిరిగిన నాయకుల మధ్య జిల్లాల విభజన పెద్ద రేఖే గీసిందట. పక్క జిల్లాకి వెళ్లాలంటేనే నాయకులు భయపడుతున్నారట. అక్కడికి వెళ్తే ఆ జిల్లా అధ్యక్షుడు…
ఇదేదో సినిమా టైటిల్ కాదు. నిజంగా జరిగిన సంఘటన. 10వతరగతి అంటే నిండా 15 ఏళ్ళు కూడా నిండవు. పెళ్లి చేసుకునే వయసు కూడా కాదు. కానీ అక్కడ అమ్మాయి, అబ్బాయి పదవతరగతి పూర్తికాకుండానే పెళ్ళి చేసుకోవాలని భావించారు. బాపట్ల జిల్లాలో టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఇన్విజిలేటర్లకు షాక్ ఇచ్చారు. పదో తరగతి పరీక్షలు పూర్తైన వెంటనే పెళ్లి చేసుకునేందుకు రింగ్స్ తో వచ్చి ఇన్విజిలేటర్లకు అడ్డంగా దొరికిపోయారు. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. చుండూరు…
ప్రకాశం జెడ్పీ సమావేశం వినూత్నంగా జరిగింది. జిల్లాల పునర్విభజన తర్వాత జరిగిన తొలి సమావేశంలో పలు ప్రత్యేకతలు కనిపించాయి. ప్రకాశం జిల్లాలోని కొన్ని నియోజకవర్గాలు నెల్లూరు, బాపట్ల జిల్లాలకు వెళ్లటంతో ఆ జిల్లాల అధికారులు కూడా హాజరయ్యారు. జిల్లాల పునర్విభజన జరిగినా జెడ్పీ పాలకవర్గం విడిపోకపోవటంతో జెడ్పీ సమావేశానికి భార్యాభర్తలైన ప్రకాశం, బాపట్ల జిల్లాల కలెక్టర్లతో నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ హాజరయ్యారు. మొదటి సారి ఇలాంటి సన్నివేశం జరగడంతో ఏ జిల్లాలోకి వెళ్లిన మండలాల సమస్యలను…