బాపట్లజిల్లా చిన్నగంజాం మండలం మూలగానివారిపాలెంలో ఆర్మీ జవాన్ సూర్యప్రకాష్ రెడ్డి కుటుంబసభ్యులు అమరణ నిరాహరదీక్ష చేపట్టారు. ఆగష్టు 21 వ తేదిన మూలగానివారిపాలెం వాసి సూర్యప్రకాష్ రెడ్డి జమ్మూలో ఆర్మీ జవాన్ గా విధులు నిర్వహిస్తూ తనగదిలో ఊరేసుకోని ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. జవాన్ సూర్యప్రకాష్ రెడ్డి చనిపోయి 40 రోజులు గడుస్తున్న ఇప్పటి వరకు తమ బిడ్డ మృతికి కారకులైన వారిపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: Russia-Ukraine war: రష్యా దాడిలో 23 మంది సాధారణ పౌరులు మృతి
పోలీస్ ఉన్నతాధికారులను తన కొడుకు మృతికి పరోక్షంగా కారకులైన వారిని అరెస్ట్ చేయాలని ఎన్ని సార్లు ఫిర్యాదులు చేసిన స్పందన లేదన్నారు. సూర్యప్రకాష్ రెడ్డి మృతికి కారకులైన వ్యక్తులు,అధికారుల పై తక్షణమే చర్యలు తీసుకోవాలని సూర్యప్రకాశ్ తండ్రి సత్యనారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. సూర్యప్రకాష్ రెడ్డి అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ఆ యువతి తనను సూర్యప్రకాష్ వేధిస్తున్నాడని చినగంజాం పిఎస్ లో ఫిర్యాదు చేసింది.
దీంతో మనస్తాపం చెందిన సూర్యప్రకాష్ రెడ్డి ఆగస్టు 21న జమ్మూలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. సూర్యప్రకాష్ మృతికి కారకులైన యువతి మరియు కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని సూర్యప్రకాష్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. తమకు న్యాయం జరిగేంత వరకు ప్రాణాలు పోయినా సరే దీక్ష విరమించేదిలేదని మృతుని కుటుంబ సభ్యులు హెచ్చరిస్తున్నారు. మరి పోలీసులు ఏం చేస్తారో చూడాలి.
Read Also: TS HIGHCOURT: 14ఏళ్ల తర్వాత నెరవేరిన 2008డీఎస్సీ అభ్యర్థుల కల