ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన ఖాతాదారులకు షాక్ ఇస్తుంది.. నో యువర్-కస్టమర్ (KYC) నిబంధనలను పాటించనందున, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే అనేక మంది ఖాతాదారుల ఖాతాలను స్తంభింపజేసింది. ఎస్బీఐ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌ను ట్యాగ్ చేస్తూ.. బ్యాంక్ కస్టమర్లు దీనికి సంబంధించిన ఫిర్యాదులను ట్వీట్ చేస్తున్నారు.. ఇంతకీ ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందనే విషయాన్ని పరిశీలిస్తే.. కేవైసీ నిబంధనల్ని పాటించని కారణంగా ఎస్బీఐ తన ఖాతాదారుల అకౌంట్లను…
స్టాక్ మార్కెట్ సూచీలు ఎట్టకేలకు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు మార్కెట్లపై ప్రభావం చూపడంతో అవి ఎంతోసేపు నిలవలేదు. చూపుతున్నాయి. గరిష్ఠాల వద్ద అమ్మకాల ఒత్తిడితో కాసేపటికే ఊగిసలాట ధోరణిలోకి జారాయి. గతవారపు భారీ నష్టాల నేపథ్యంలో కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు. స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో కొనసాగుతోంది. ఉదయం 10.32 గంటలకు బీఎస్‌ఈ సెన్సెక్స్ 78 పాయింట్లు నష్టపోయి 51,281 వద్ద ట్రేడవుతోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 34…
ఆంధ్రప్రదేశ్‌లో దోపిడీ దొంగలు కలకలం సృష్టించారు.. పట్టపగలే బ్యాంకులోకి దూరి.. తుపాకీతో బెదిరించి అందినకాడికి ఎత్తుకెళ్లారు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఓ బ్యాంకులో లూఠీ జరిగింది.. అనకాపల్లిలోని నర్సింగబిల్లి గ్రామీణ వికాస్ బ్యాంక్‌లో ఈ ఘటన జరిగింది.. బ్యాంకులోకి ప్రవేశించిన దొంగలు.. బ్యాంకు సిబ్బందిని తుపాకీతో బెదిరించి అందినకాడికి నగదు ఎత్తుకెళ్లారు. ఇక, బ్యాంకు సిబ్బంది ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అనకాపల్లి పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బ్యాంకులోని సీసీ…
కర్ణాటకకు చెందని ఓ వ్యక్తి తనకు డబ్బు అవసరం కావడంతో బ్యాంకునుంచి తీసుకోవాలని అనుకున్నాడు. లోన్ కోసం బ్యాంకుకు అప్లికేషన్ పెట్టుకున్నాడు. అయితే, బ్యాంకు అధికారులు అతని డాక్యుమెంట్స్‌ను పరిశీలించిన తరువాత లోన్ అప్లికేషన్‌ను రిజక్ట్ చేశారు. దీంతో ఆగ్రహించిన ఆ వ్యక్తి బ్యాంకుకు నిప్పంటించాడు. బ్యాంకులు మంటలు అంటుకోవడంతో వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనకు కారణమైన వ్యక్తిపై పోలీసులు సెక్షన్ 246,477,435 ఐపీసీ కింద కేసులు నమోదు చేశారు.…
బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్. నవంబర్‌లో బ్యాంకులకు వరుస సెలవులు రానున్నాయి. ఆర్‌బీఐ ప్రకటించిన జాబితా ప్రకారం ముఖ్యమైన పండుగలు, సాధారణ సెలవులు కలుపుకొని మొత్తం 17 రోజులు బ్యాంకులు పనిచేయవు. గత కొద్దీ రోజులుగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న వార్త ఇది. అయితే ఇందులో పూర్తిగా వాస్తవం లేదు. ఎందుకంటే ఆ సెలవులు అన్ని రాష్ట్రాలకూ వర్తించవు. రాష్ట్రాలను బట్టీ మారుతూ ఉంటాయి. స్థానిక పండుగ రోజుల్లో ఆయా రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు. ఆ…
డిజిటల్ లావాదేవీలు పెరిగిన తర్వాత బ్యాంకులకు వెళ్లేవారి సంఖ్య తగ్గుముఖం పట్టినా.. నిత్యం బ్యాంకుల చుట్టూ తిరిగేవారు ఇంకా పెద్ద సంఖ్యలోనే ఉంటారు.. కానీ, వారు అలర్ట్ కావాల్సిన సమయం ఇది.. ఎందుకంటే.. ఈ నెలలో ఏకంగా 21 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి.. అంటే ఒకే నెలలో 21 రోజుల పాటు బ్యాంకు లావాదేవీలు జరగవు అన్నమాట.. ఆ 21 రోజుల్లో 14 రోజులు ఆర్‌బీఐ అధికారిక సెలవులు కాగా, మరో ఏడు రోజులు…
అక్టోబరు నెలలో దేశంలోని బ్యాంకులకు.. 21 రోజుల పాటు సెలవులను భారత రిజర్వ్ బ్యాంకు ప్రకటించింది. దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రాష్ట్రాలు, ప్రాంతాల వారీగా 21 రోజుల పాటు వేర్వేరు రోజుల్లో సెలవులు ఇచ్చారు. రిజర్వ్ బ్యాంకు నిబంధనల ప్రకారం అక్టోబరు నెలలో 14 రోజులపాటు సెలవులున్నాయి. దీంతో పాటు ఆదివారాలు, రెండో, నాలుగో శనివారాలు కలిపి ఏడు వారాంతపు సెలవులున్నాయి. అక్టోబరు 1వతేదీన బ్యాంకుల క్లోజింగ్ ఆఫ్ అకౌంట్స్ కాబట్టి… గ్యాంగ్ టక్ లో…
జులై నెలలో బ్యాంకు లావాదేవీలు చేసే వారికి ఓ బాడ్ న్యూస్. జులై నెలలో మొత్తం 15 రోజుల పాటు బ్యాంకులు మూత పడనున్నాయి. ఈ మేరకు రిజర్వు బ్యాంక్ అధికారికంగా ప్రకటన చేసింది. జూలై నెలలో నాలుగు ఆదివారాలు మరియులు రెండో, నాలుగో శనివారాలు బ్యాంకు సిబ్బందికి సాధారణంగా సెలవులు ఉంటాయి. కానీ..జూలై నెలలో పండుగలు, ప్రత్యేకమైన రోజుల కారణంగా మరో తొమ్మిది రోజుల పాటు బ్యాంకులకు హాలీ డేస్ వచ్చాయి. అయితే ఈ సెలవులు…
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు, రాష్ట్రంలోని వివిధ బ్యాంకులలో పని చేస్తున్న అధికారులకు, సిబ్బందికి స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టి వ్యాక్సినేషన్ ను వారం రోజుల్లో పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శనివారం వివిధ బ్యాంకుల ప్రతినిధులతో బ్యాంక్ అధికారులు, సిబ్బంది వ్యాక్సినేషన్ పై బి.ఆర్.కె.ఆర్ భవన్ లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రతి…