ఓ యువకుడు ఒక్క నిమిషంలో బిలియనీర్ అయ్యాడు, ఎక్కడో బ్యాంకు ఖాతా నుండి ఒకటిన్నర ట్రిలియన్ రూపాయలు వచ్చిచేరాయి… ఆ యువకుడి ఆనందానికి అవదులే లేవు.. కానీ, ఖాతాలో డబ్బులు ఉన్నా.. తీసుకోలేని పరిస్థితి.. అసలు ఆ యువకుడి ఖాతాలోకి అంత మొత్తం ఎలా వచ్చింది..? ఆనే విషయాన్ని తెలుసుకోవడానికి.. ఆ యువకుడి ఖాతాను తాత్కాలికంగా నిలిపివేశారు బ్యాంకు అధికారులు.. బీహార్‌లో నిమిషాల్లోనే ట్రిలియనీర్ అయిన ఓ యువకుడికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Read Also: Bulldozer Action: యోగి అంటే అట్లుంటది మరి..! బీజేపీ నేత ఇంటికి బుల్డోజర్..
బర్హియా నివాసి సుమన్ తాజాగా తన బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకున్నప్పుడు.. అతనికి అర్థం కాలేదు… తన ఖాతాల్లో వేల కోట్లు ఉండడంతో ఏం జరిగిందో అతడికి అర్థం కాలేదు.. ఏకంగా కోటీశ్వరుడు కావడంతో.. తన ఆనందానికి అవదులు లేకుండా పోయాయి.. ఏకంగా రూ.6,833 కోట్లు చూసి సంతోషపడ్డాడు.. ఈ ఘటనపై సదరు యువకుడు మాట్లాడుతూ.. నాకు డీ మార్ట్ ఖాతా ఉంది.. తరచూ ట్రేడింగ్ చేస్తుంటారు.. జూలై 26వ తేదీ ఉదయం 11:20 గంటలకు తన ట్రేడింగ్ ఖాతాలో రూ.6,833 కోట్లు వచ్చాయని తెలిపాci.. అయితే, ఇంత భారీ మొత్తం తన ఖాతాలోకి ఎలా వచ్చిందో, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదన్నాడు.. అతను ఆ ఖాతా నుండి ఏ మొత్తాన్ని తీసుకోలేడు. ఇది అతడికి ఇబ్బందిగా మారింది. తన ఖాతాలోకి భారీ మొత్తం రావడంతో బ్యాంకులో ఆరా తీశాడు యువకుడు.. ఈ మొత్తానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేయాలని సుమన్.. ఆర్టీఐ ద్వారా కోటక్ సెక్యూరిటీని అభ్యర్థించారు. దీంతో పాటు ఆ సొమ్ము ఎవరిదనే వివరాలను కూడా కోరాడు.. కంపెనీ చెప్పిన మొత్తంపై సరైన సమాచారం ఇవ్వకపోతే వినియోగదారుల కోర్టును కూడా ఆశ్రయిస్తానని చెబుతున్నాడు.. అంత డబ్బు తనది కాదంటున్నాడు.. మొత్తంగా ఈ వార్త ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది. కాగా, గతంలోనే వేల కోట్లు సామాన్యుల ఖాతాల్లో, జన్‌ధన్ ఖాతాల్లో దర్శనమిచ్చి.. సదరు ఖాతాదారులను ఉక్కిరిబిక్కిరి చేసిన ఘటనలు ఎన్నో వెలుగుచూసిన విషయం తెలిసిందే.