బంజారాహిల్స్ కేబిఅర్ పార్క్ సమీపంలోని ‘After 9 pub’ లో అర్దరాత్రి వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ రైడ్స్ చేసారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న After 9 పబ్ నిర్వాహకులు కస్టమర్లను ఆకర్షడానికి వేరే రాష్ట్రం నుండి యువతులను తీసుకువచ్చి పబ్ లో అసభ్యకరమైన డాన్సులు చేపిస్తునట్లు సమాచారం అందడంతో ఈ దాడులు నిర్వహించారు. అర్ధరాత్రి యువతులు మద్యం మత్తులో డాన్స్ చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు అందడంతో దాడులు చేసారు. గతంలో కూడా After 9 పబ్…
చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డిపై బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మూడు రోజుల క్రితం ఫోన్ చేసి దిగజారుడు మాటలు మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన మనుషులను ఎలా కలుస్తారని కొండా విశ్వేశ్వర్ రెడ్డికి ఫోన్ చేసి రంజిత్ రెడ్డి అడిగారు. దీంతో స్పందించిన విశ్వేశ్వర్ రెడ్డి నీకు దమ్ముంటే నా వాళ్లను తీసుకెళ్లు అని కౌంటర్ ఇచ్చారు. ఇరువురి మధ్య మాటమాట పెరిగింది. ఈ క్రమంలో..…
హైదరాబాద్ బంజారాహిల్స్ లో శనివారం అగ్ని ప్రమాదం జరిగింది. రోడ్ నెంబర్. 4లోని ఓ ప్రైవేట్ హోటల్ పార్కింగ్ ప్లేస్ లో ఉన్న మూడు కార్లు మంటల్లో కాలి బూడిదయ్యాయి. ఈ ఘటనపై వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. ఘటన స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేశారు. కాగా, ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
బంజారాహిల్స్ సీఐ నరేందర్ ఇంట్లో, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఇక, ఏసీబీ అధికారులు సీఐను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తుంది. ఈ వ్యవహారంలో ఎస్‌ఐ నవీన్‌రెడ్డి, హోంగార్డ్ హరిని కూడా ఏసీబీ విచారిస్తుంది.
రాయ్‌పూర్‌కు చెందిన 90 ఏళ్ల వృదుడికి క్వాడ్రాపూల్ బైపాస్సర్జరీని విజయవంతంగా నిర్వాయించినట్లు కేర్ హస్పిటల్ బంజారాహిల్స్‌లోని కార్డియాక్ సర్జరీ డైరెక్టర్ ప్రతీక్ భట్నాగర్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్ లో బంజారాహిల్స్ స్పాలు, మసాజ్ సెంటర్లు, బ్యూటీ స్పాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరో స్పాస్‌లోన్‌పై దాడి చేసి నిర్వాహకులపై కేసు నమోదు చేశారు.
భారతదేశంలోని ప్రముఖ పీడియాట్రిక్, ఉమెన్ హెల్త్‌కేర్ ప్రొవైడర్ అయిన రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్.. జాయింట్ కమిషన్ ఇంటర్నేషనల్ (JCI) నుంచి అత్యంత ప్రతిష్టాత్మకమైన 'గోల్డ్ సీల్ ఆఫ్ క్వాలిటీ అప్రూవల్'ని పొందినట్లు వెల్లడించింది.