బంజారాహిల్స్‌లో సీఐగా విధులు నిర్వహిస్తున్న.. నరేందర్ లంచం తీసుకుంటూ.. ఏసీబీ అధికారులకు చిక్కారు. బంజారాహిల్స్ లోని స్కైలాంజ్ పబ్ ఓపెనింగ్ కు యాజమాని నుంచి రూ.3 లక్షలు డిమాండ్ చేస్తున్నాడని పబ్ యాజమాని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు వెంటనే బంజారాహిల్స్ పీఎస్‌లో సోదాలు చేశారు. పబ్ నుంచి తొలుత 4.5 లక్షలు బంజారాహిల్స్ సీఐ నరేందర్ డిమాండ్ చేశాడని స్కై లాంజ్ పబ్ ఓనర్ ఏసీబీ అధికారులకు వెల్లడించాడు. చివరిగా సీఐ నరేందర్‌తో 3 లక్షల రూపాయలను డీల్ కుదుర్చుకున్నట్లు పబ్ ఓనర్ ఏసీబీ అధికారులకు తెలిపాడు. ఇందులో 50 వేల రూపాయలను గతంలో సీఐకు పబ్ ఓనర్ చెల్లించాడు.. ఆ డబ్బులు ఇచ్చే సమయంలో బాధితుడు వీడియో రికార్డింగ్ చేశాడు అని ఏసీబీకి చెప్పాడు.
Read Also: Wamiqa Gabbi: సెన్సార్ లేదని.. నగ్నంగా చూపించేస్తారా.. ?
దీంతో సీఐ నరేందర్ ఇంట్లో, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఇక, ఏసీబీ అధికారులు సీఐను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తుంది. ఈ వ్యవహారంలో ఎస్‌ఐ నవీన్‌రెడ్డి, హోంగార్డ్ హరిని కూడా ఏసీబీ విచారిస్తుంది. ఇక, సీఐ నరేందర్ ఇంట్లో భారీ మొత్తంలో నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కి ఒక పెద్ద సైజ్ బ్యాగ్.. నోట్స్ కౌంటింగ్ మెషీన్ తీసుకొని వెళ్లారు. ఓ ల్యాండ్ సెటిల్మెంట్ లో సీఐ భారీగా లంచం తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గత కొంతకాలంగా సీఐ నరేందర్ పై వరుస ఫిర్యాదులు రావడంతో ఏసీబీ డీఎస్పీ శ్రీకాంత్ విచారిస్తున్నారు.
Read Also: Putin: రష్యా నుంచి భారత్‌ని దూరం చేసే ప్రయత్నాలు ఫలించవు..
ఏసీబీ అధికారులు తీసుకెళ్లిన బ్యాగులో భారీగా నగదు ఉన్నట్టు సమాచారం.. పబ్బులు, స్పాలలో అక్రమ వసూళ్లకు నరేందర్ పాల్పడినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. చాలా కేసుల్లో సీఐ నరేందర్ పై ఆరోపణలు వచ్చాయి. తాజాగా ఓ సివిల్ మ్యాటర్ లో కూడా సీఐ నరేందర్ తల దూర్చినట్టు తెలుస్తుంది. సదరు సివిల్ మ్యాటర్లోని నరేందర్ పై ఏసీబీ రైడ్స్ చేసినట్లు తెలుస్తుంది. ఈ ముగ్గురితో పాటు మిగతా ఎస్ఐలను ఏసీబీ అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు. పక్కా ఆధారాలతో ఏసీబీ రైడ్స్ చేస్తుంది. ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది.