Hyderabad: పోలీసులు నిబద్దతతో పని చేస్తే ఎలాంటి మిస్టరినైనా చేధించగలరు. ప్రజలను రక్షించేందుకే పోలీసులు ఉన్నారని నిరూపినిచ్చారు ఓ కానిస్టేబుల్. ఎంతో కష్టపడి తప్పిపోయిన చిన్నారి చూకీ కనుగొని ఆ చిన్నారిని తల్లిదండ్రుల దగ్గరకి చేర్చారు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో ఈ నెల 9వ తేదీన ఓ బాలిక మిస్ అయ్యింది. స్కూల్ కి వెళ్లి వస్తాను అని చెప్పి ఇంటి నుండి బయలుదేరిన ఆ చిన్నారి రాత్రి అయిన ఇంటికి రాలేదు. చిన్నారి ఇంటి రాకపోయేసరికి ఆ చిన్నారి తండ్రి, సోదరుడు అన్ని చోట్ల వెతికారు. అయిన ఫిలతం లేకపోయింది. దీనితో వాళ్ళు పోలీసులను ఆశ్రయించారు. చైల్డ్ మిస్సింగ్ కేసు గా నమోదు చేసుకున్న పోలీసులు ఆ కేసును హెడ్ కానిస్టేబుల్ నాగేశ్వరావుకు అప్పగించారు.
కేసు బాధ్యతను స్వీకరించిన కానిస్టేబుల్ నిబద్దతతో పని చేశారు. మొదటగా అతను ఠాణా పరిధి లోని సీసీ కెమెరాలను పరిశీలించాగా అందులో చిన్నారి కృష్ణానగర్ ఆటో ఎక్కి వెళ్లడం గమనించాడు. దీనితో అతను కృష్ణానగర్, యూసఫ్ గూడ, అమీర్ పేట్, బేగంపేట్, పారడైజ్, సికింద్రాబాద్ వరకు దాదాపు 100 సీసీ కెమెరాలను పరిశీలించాడు. ఇలా ఆ కానిస్టేబుల్ రెండు రోజులు కష్టపడగా కష్టానికి ప్రతిఫలంగా ఓ పెట్రోల్ బంకులో ఆటో నెంబర్ ను కనుగొన్నాడు. వెంటనే ఆ ఆటో నెంబర్ ఆధారంగా ఆ ఆటో డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారించగా ఆ ఆటో డ్రైవర్ తాను ఆ పాపను సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో వదిలిపిపెట్టినట్టు తెలిపాడు. ఈ నేపథ్యంలో కానిస్టేబుల్ రైల్వే స్టేషన్ లోని ఆర్ పీఎఫ్ కెమెరాలను పరిశీలించాడు.
Read also:Bandi Sanjay: ఫస్ట్ కు జీతాలు ఇవ్వలేరు కానీ.. మళ్లీ అధికారిమా..! కేసీఆర్ పై బండి ఫైర్
ఆ కెమెరాలలో చిన్నారి ఓ అజ్ఞాత వ్యక్తితో మాట్లాడడం గమనించాడు. అలానే ఆ అజ్ఞాత వ్యక్తి తన బైక్ పైన ఆ చిన్నారిని ఎక్కించుకోని వెళ్లడం కూడా కెమెరాలో రికార్డయినది. దీనితో బైక్ నెంబర్ ఆధారంగా ఆ అజ్ఞాత వ్యక్తిని అదుపు లోకి తీసుకుని విచారించగా.. ఆ అజ్ఞాత వ్యక్తి తనకి ఆ పాప ఏడుస్తూ కనిపించిందని.. ఎందుకు ఏడుస్తున్నావని అడగగా తాను ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంటున్నట్లు తెలిపిందని.. ఈ క్రమంలో ఆ చిన్నారిని ఓదార్చి యాదగిరిగుట్ట లోని ఓ ప్రయివేట్ హాస్టల్ లో పెట్టినట్లు తెలిపాడు. దీనితో ఈ నెల 15వ తేదీన పోలీసులు పాపను హాస్టల్ నుండి బాలికల భరోసా కేంద్రానికి తరలించారు. ఆ తరువాత చిన్నారిని కుటుంబసభ్యులకు అప్పగించారు. 5రోజులు కష్టపడి దాదాపు 212 సీసీ కెమెరాలు పరిశీలించి పాప ఆచూకీ తెలుసుకున్న హెడ్ కానిస్టేబుల్ నాగేశ్వరరావును అధికారులు అభినందించారు.