భారత్‌లోని పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలతో బంగ్లాదేశ్ 4 వేల కిలో మీటర్ల సరిహద్దును కలిగి ఉంది. గంగ, బ్రహ్మపుత్ర, సుందర్బన్‌లకు 53 కంటే ఎక్కువ చిన్న నదులు, వాగులు సరిహద్దులుగా కొనసాగుతున్నాయి. ఇక, నీటి పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతుండటంతో.. 24 గంటలూ ఆ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టినట్లు బీఎస్‌ఎఫ్ వర్గాలు చెప్పాయి.