ముంబై అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో భారీగా విదేశీ గంజాయి పట్టుబడింది. రూ.39 కోట్ల విలువ చేసే 39 కేజీల విదేశీ గంజాయిను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి ముంబైకు తరలిస్తుండగా స్మగ్లింగ్ ముఠాను అధికారులు వల పన్ని పట్టుకున్నారు.
ప్రధాని మోడీ బ్యాంకాక్ చేరుకున్నారు. అక్కడ ఘనస్వాగతం లభించింది. రెండు దేశాల పర్యటన కోసం గురువారం బయల్దేరి వెళ్లారు. నేటి నుంచి థాయ్‌లాండ్, శ్రీలంకలో పర్యటించనున్నారు. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ ఎయిర్‌పోర్టులో దిగగానే మోడీకి ఘనస్వాగతం లభించింది. థాయ్‌లాండ్ అధికారులతో పాటు భారతీయులు భారీ స్వాగతం పలికారు.
మయన్మార్, బ్యాంకాక్‌లో చోటుచేసుకున్న భూకంపాలు కారణంగా 1000 మందికి పైగా మృతి చెందారు. వందలాది మంది గాయపడ్డారు. మరోవైపు రెస్క్యూ సిబ్బంది సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు. శిథిలాల కింద మరికొంత మంది ఉంటారని అనుమానిస్తు్న్నారు. ఇక థాయిలాండ్ ప్రధాని అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.
ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు భారీ భూకంపాలతో హడలెత్తిపోయాయి. ఈ ఉదయం బ్యాంకాక్, మయన్మార్‌లో పెద్ద ఎత్తున భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 7.7గా నమోదైంది. దీంతో భారీ అంతస్తుల బిల్డింగ్‌లు నేలకూలిపోయాయి. భయంతో జనాలు పరుగులు తీశారు.
భారత్‌లోనూ భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేల్‌పై 6.8గా నమోదైనట్లుగా తెలుస్తోంది. దేశ రాజధాని ఢిల్లీ సహా కోల్‌కతా, రాంచీ, త్రిపుర, అస్సాం, పాట్నాలో భూప్రకంపనలు సంభవించాయి. దీంతో భయంతో విద్యార్థులు, అధ్యాపకులు క్లాస్ రూమ్‌లోంచి బయటకు వచ్చేశారు. అలాగే అధికారులు కూడా కార్యాలయాల్లోంచి ఇళ్లకు వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మయన్మార్, బ్యాంకాక్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 7.7గా నమోదైంది. దీంతో ప్రజలు హడలెత్తిపోయారు. పలు కార్యాలయాల అద్దాలు ధ్వంసం అయ్యాయి. భీకర ప్రకంపనలకు ప్రజలు గజగజ వణికిపోయారు. భయంతో పరుగులు పెట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఒకప్పుడు యూట్యూబర్ హర్ష సాయి చేసిన సహాయం గురించి ఎక్కువగా వినిపించేది. కానీ ఇప్పుడు అతనికి సంబంధించిన రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. అతను బెట్టింగ్ యాప్‌లను ప్రచారం చేస్తూ.. కోట్లు సంపాదిస్తున్నాడని.. ప్రత్యక్షంగానూ పరోక్షంగానే అనేక మంది బెట్టింగ్ యాప్‌ల బారిన పడి ప్రాణాలు కోల్పోవడానికి కారణం అయ్యాడనే విమర్శలు వినిపించాయి. ఆ తరువాత హర్షసాయి పెళ్లి పేరుతో తనని మోసం చేశాడని మిత్రా శర్మ హైదరాబాద్ నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అడ్వకేట్‌తో స్టేషన్‌కి…
బ్యాంకాక్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. స్కూల్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 25 మంది విద్యార్థులు సజీవదహనం అయ్యారు. మరికొందరికి గాయాలయ్యాయి. గాయపడ్డ విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు.
నంద్యాల జిల్లా వాసి బ్యాంకాక్‌లో కిడ్నాప్ అయిన కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగానికి బెంగుళూరు నుంచి బ్యాంకాక్ వెళ్తున్నట్టు కిడ్నాప్ అయిన మధుకుమార్ కుటుంబ సభ్యులకు చెప్పి వెళ్లాడు.