బ్యాంకాక్‌లో నంద్యాల జిల్లా వాసి కిడ్నాప్ ఘటన కలకలం రేపుతోంది. నంద్యాల జిల్లా డోన్ మండలం చిన్న మల్కాపురంకు చెందిన మధు కుమార్ అనే వ్యక్తి కిడ్నాప్ అయ్యాడు. కిడ్నాప్ చేసిన దుండగులు 8 లక్షలు డిమాండ్ చేసినట్లు తెలిసింది.
డిజిటల్ యుగంలో సాంకేతికత వినియోగం చాలా పనులను సులభతరం చేసింది. అయితే నేరస్థులు తమ అక్రమాలకు కూడా ఈ టెక్నిక్‌లను ఉపయోగిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఇలాంటి ఉదంతం వెలుగులోకి చూసింది.
కర్ణాటక రాజధాని బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో 10 పసుపు అనకొండలను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన ఓ ప్రయాణికుడిని అరెస్టు చేశారు. అతని చెక్-ఇన్ బ్యాగేజీలో సరీసృపాలు దాగి ఉన్నాయి.
Passenger Suicide Attempt in Flight: తైవాన్‌కు చెందిన ‘ఇవా ఎయిర్‌లైన్స్’ ఫ్లైట్‌లో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. విమానం గాల్లో ఉండగా.. ఓ ప్రయాణికుడు వాష్‌రూమ్‌లో ఆత్మహత్యకు ప్రయత్నించాడు. దీంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఈ ఘటన గత శుక్రవారం (మార్చి 15) జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రయాణికుడి వివరాలు, ఆత్మహత్యాయత్నానికి గల కారణాలను ఇవా ఎయిర్‌లైన్స్ వెల్లడించలేదు. ఇవా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బీఆర్ 67 ఫ్లైట్ మార్చి 15న బ్యాంకాక్…
థాయ్ ఎయిర్‌వేస్ విమానంలో బ్రిటన్‌కు చెందిన ప్రయాణికుడు నానా రచ్చ చేశాడు. కోపంలో ఏకంగా విమాన సిబ్బందిలో ఒకరిపై చేయి చేసుకున్నాడు.. ఇక, దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో ఓ లగ్జరీ మాల్‌లో జరిగిన కాల్పుల్లో కనీసం ముగ్గురు మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారని పోలీసులు మంగళవారం తెలిపారు. ఈ ఘటనలో 14 ఏళ్ల అనుమానిత సాయుధుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
దక్షిణ థాయ్‌లాండ్‌లో కాల్పులు కలకలం రేపాయి. రాజధాని బ్యాంకాక్‌కు దక్షిణంగా దాదాపు 600 కిమీ దూరంలో సూరత్ థాని ప్రావిన్స్‌లోని ఖిరి రాత్ నిఖోమ్ లో సాయంత్రం 5 గంటలకు కాల్పులు చోటు చేసుకున్నాయి.
Thailand van accident: థాయ్‌లాండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న వ్యాన్ ప్రమాదానికి గురికావడంతో ఇద్దరు పిల్లలతో సహా 11 మంది సజీవదహనం అయ్యారు. లూనాన్ న్యూ ఇయర్ సెలవుల సందర్భంగా సెంట్రల్ థాయ్‌లాండ్ నుంచి ప్రయాణికులతో వెళ్తున్న వ్యాన్ అదుపుతప్పి ప్రమాదనికి గురైందని 11 మంది మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మొత్తం ప్రమాదంలో ఒకే ఒక్కడు ప్రాణాలతో బయటపడ్డా