బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా విజయం దిశగా దూసుకువెళ్తోంది. రెండో రోజు ఆటలో మరో 10 ఓవర్ల ఆట మిగిలి ఉండగా రెండో ఇన్నింగ్స్‌ను 303/9 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. రిషబ్ పంత్ (50), శ్రేయస్ అయ్యర్ (67) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. రోహిత్ (46), విహారి (35), జడేజా (22), మయాంక్ (22) పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో జయవిక్రమ 4 వికెట్లు, ఎంబుల్‌దెనియా 3 వికెట్లు పడగొట్టారు. తొలి…
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో మైలురాయిని అందుకోనున్నాడు. శ్రీలంకతో ఈనెల 12 నుంచి బెంగళూరు వేదికగా జరిగే రెండో టెస్టు ద్వారా రోహిత్ తన కెరీర్‌లో 400వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడనున్నాడు. రోహిత్ ఇప్పటివరకు 44 టెస్టులు, 230 వన్డేలు, 125 టీ20లు ఆడాడు. 2007లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ మొదట్లో వరుసగా విఫలం కావడంతో జట్టులో సుస్థిర స్థానం సంపాదించుకోలేకపోయాడు. 2013లో ఓపెనర్ అవతారం ఎత్తినప్పటి నుంచి తిరుగులేకుండా దూసుకెళ్తున్నాడు.…
శ్రీలంకతో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌కు టీమిండియా మరింత బలోపేతం అయ్యింది. తొలి టెస్టుకు గాయం కారణంగా దూరంగా ఉన్న అక్షర్ పటేల్.. రెండో టెస్టు కోసం జట్టులోకి వచ్చాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకుని తగిన ఫిట్‌నెస్ సాధించిన అక్షర్ పటేల్ ఈ నెల 12 నుంచి శ్రీలంకతో బెంగళూరు వేదికగా జరగనున్న రెండో టెస్టు మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడని బీసీసీఐ వెల్లడించింది. ఈ నేపథ్యంలో అక్షర్ పటేల్ జట్టులోకి రావడంతో కుల్‌దీప్ యాదవ్ టీం నుంచి…