Bandla Ganesh: టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ గురించి అందరికి తెల్సిందే. తన మనసుకు ఏది అనిపిస్తుందో అది ముఖం మీదనే చెప్పేస్తాడు. ఇంటర్వ్యూలో కానీ, ట్విట్టర్ లో కానీ తనకు నచ్చని విషయాన్ని ధైర్యంగా చెప్పుకొస్తాడు. ఇక సోషల్ మీడియాలో బండ్లన్న స్పీచ్ కు, ట్వీట్స్ కు ప్రత్యేక అభిమానులు ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు.
వివాదాస్పద ప్రసంగాలకు కేరాఫ్ అడ్రస్ అయిన నిర్మాత బండ్ల గణేశ్.. చోర్ బజార్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో పూరీ జగన్నాథ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ‘‘ఎందరినో స్టార్ హీరోల్ని చేసిన నీకు, నీ కొడుకు ఈవెంట్ కి రావడానికి టైం లేదా? ముంబైలో వెళ్లి కూర్చున్నావ్’’ అంటూ ఓ రేంజ్ లో వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. అంతేకాదు.. ‘పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నావ్, వాళ్లందరినీ చచ్చేదాకా చూసుకోవాల్సిన బాధ్యత నీదే’నంటూ వ్యక్తిగతంగానూ టార్గెట్ చేశాడు.…
బండ్ల గణేష్. కామెడియన్‌గా సినిమా పరిశ్రమలో అడుగు పెట్టి.. నటుడిగా ఎదుగుతూ నిర్మాతగా బ్లాక్ బస్టర్ సినిమాలు అందించారు. ఇండస్ట్రీలో ఆయన ఎప్పుడూ ప్రత్యేకం. ఆ ప్రత్యేకత కారణంగానే ఆయన ఏం మాట్లాడినా సంచలనంగా మారుతుంది. పవన్ కల్యాణ్‌కు వీరాభిమానిగా చెప్పుకొంటారు. సినిమా పంక్షన్స్‌లో మైక్ పట్టుకుంటే పూనకం వచ్చినట్టు ఊగిపోతుంటారు కూడా. అయితే ఇటీవల కాలంలో బండ్ల గణేష్ తీరు అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. ఆయన ఏం మాట్లాడుతున్నారో? ఏం మాట్లాడాలని ఇంకే మాట్లాడుతున్నారో అర్థం…
తన ‘చోర్ బజార్’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఆకాశ్ పూరీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా.. నెపోటిజంపై సుదీర్ఘంగా ప్రసంగించాడు. తనపై కూడా నెపోటిజం కామెంట్స్ వచ్చాయని తెలిపిన ఆకాశ్.. బ్యాక్‌గ్రౌండ్‌తో వచ్చిన ట్యాలెంట్ నిరూపించుకుంటేనే ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటారని, తానూ అదే ప్రయత్నం చేస్తున్నానని తెలిపాడు. తాను చిటికేస్తే కోరుకున్నవన్నీ తన ముందు వాలుతాయని, తన తండ్రి ఏం అడిగినా ఇచ్చేంత సౌకర్యం తనకుందని, కానీ తాను మాత్రం తన కాళ్లపై నిలబడాలనుకుంటున్నానని, అందుకే కష్టపడుతున్నానని అన్నాడు.…
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కిన చిత్రం 'చోర్ బజార్'. జీవన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 24 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటుడిగా, నిర్మాతగా ఎంతోమందికి సుపరిచితమే. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా పవన్ ఫ్యాన్స్ కు తోడు నీడగా ఉంటూ వస్తున్నాడు. పవన్ ను దేవర గా కొలిచే బండ్ల .. నిత్యం ఆయన నామ స్మరణలోనే ఉంటాడు అని ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం లేదు. పవన్ సీఎం కావాలని జనసేన పార్టీని సపోర్ట్ చేస్తూ ట్వీట్స్ చేస్తూనే ఉంటాడు. అయితే గత కొన్ని నెలలుగా…
నటుడు, నిర్మాత బండ్ల గణేష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అభిమాని అనడం కన్నా భక్తుడు అని చెప్పాలి. పవన్ ను దేవుడిలా కొలుస్తూ ఉంటాడు. పవన్ కు ఎప్పుడు అండగా ఉండడానికి సిద్ధం గా ఉంటాడు. ఇక ఎవరైనా పవన్ ను విమర్శిస్తే మాత్రం అస్సలు ఊరుకోడు. వారికి తనదైన స్టైల్లో బుద్ధి చెప్పేవరకు నిద్రపోడు. అందుకే పవన్ అభిమానులకు బండ్లన్న అంటే మక్కువ ఎక్కువ.. ఇక నిత్యం సోషల్ మీడియాలో తన దేవర…
నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన జీవితం అందరికి తెరిచిన పుస్తకమే. నటుడిగా కెరీర్ ను ప్రారంభించడం, ఆ తర్వాత నిర్మాత గా మారడం, రాజకీయాలకు వెళ్లడం, అందులో నిలబడలేక మళ్లీ వెనక్కి రావడం అన్ని తెలిసినవే.. ఇక ఇటీవల నటుడిగా కూడా రీ ఎంట్రీ ఇచ్చిన బండ్లన్న తాజాగా డేగల బాబ్జీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మే 20 న రిలీజ్ అయినా ఈ సినిమాను పట్టించుకొనే…
ఒక రీమేక్.. ప్లాప్స్ లో ఉన్న స్టార్ హీరో.. ఐరన్ లెగ్ అనిపించుకున్న హీరోయిన్ .. అప్పుడే ఎదుగుతున్న డైరెక్టర్.. నటుడిగా సంపాదించుకున్న డబ్బునంతా ఈ సినిమాపై పెట్టిన నిర్మాత.. ఇంతమంది జీవితాలు ఒకే ఒక్క సినిమాపై ఆదాహారపడి ఉన్నాయి. హిట్ అయితే వీరందరూ తమ పేరును సార్ధకం చేసుకుంటారు.. అవ్వకపోతే మరో ప్లాప్ ను అందుకుంటారు అని ప్రేక్షకుల విమర్శలు.. ఇవేమి పట్టించుకోకుండా అందరు కలిసి తమ సినిమాపై నమ్మకంతో 2012, మే 11 న…
‘ప్లస్ ఇంటూ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్’ – ఇందులో గొప్పేముంది? ‘మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్’ – ఇది కదా మజా ఇచ్చేది! సినిమా రంగంలో అధిక సంఖ్యాకులు ‘ప్లస్ ఇంటూ ప్లస్’కే జై కొడతారు. కానీ, కొన్నిసార్లు ‘మైనస్ ఇంటూ మైనస్ – ప్లస్’ అవుతుందనీ నిరూపణ అయ్యింది. అలా చేసిన చిత్రాల్లో పదేళ్ళ క్రితం పవన్ కళ్యాణ్ హీరోగా జనం ముందు నిలచిన ‘గబ్బర్ సింగ్’ కూడా…