బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటుడిగా, నిర్మాతగా ఎంతోమందికి సుపరిచితమే. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా పవన్ ఫ్యాన్స్ కు తోడు నీడగా ఉంటూ వస్తున్నాడు. పవన్ ను దేవర గా కొలిచే బండ్ల .. నిత్యం ఆయన నామ స్మరణలోనే ఉంటాడు అని ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం లేదు. పవన్ సీఎం కావాలని జనసేన పార్టీని సపోర్ట్ చేస్తూ ట్వీట్స్ చేస్తూనే ఉంటాడు. అయితే గత కొన్ని నెలలుగా పవన్ కళ్యాణ్ – బండ్ల గణేష్ మధ్య దూరం పెరిగిందని.. ఇప్పుడు ఇద్దరి మధ్య ఏదీ బాగాలేదని టాక్ నడుస్తోంది. భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు బండ్ల ను, పవన్ ఆహ్వానించకపోవడంతో ఆయన కొద్దిగా అసహనానికి గురైన విషయం తెల్సిందే.. ఆ సమయంలో త్రివిక్రమ్ వలనే ఇదంతా జరిగిందని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.
ఇక తాజాగా ఆయన చేసిన ట్వీట్ కూడా కొంచెం అనుమానించదగ్గ విషయం లా అనిపిస్తోంది. నిన్న ఫాదర్స్ డే సందర్భంగా సెలబ్రిటీస్ అందరూ తమ తండ్రి ఫోటోలను షేర్ చేస్తూ విషెస్ చెప్పిన విషయం విదితమే.. ఇక బండ్ల గణేష్ కూడా తమ తల్లిదండ్రుల ఫోటో ను షేర్ చేసి ఫాదర్స్ డే విషెస్ తెలిపాడు. అయితే ఆ ఫోటో ఉన్న ప్లేస్ లో ఒకప్పుడు పవన్, బండ్ల గణేష్ కలిసి దిగిన ఫోటో ఉండేది. ఇప్పుడు ఆ ఫోటోను తీసేసి ఆ స్థానం లో తల్లిదండ్రుల ఫోటోను ఉంచాడు గణేష్. అయితే పవన్ ఫోటోను మార్చాల్సిన అవసరం ఏమి వచ్చింది..? నిజంగానే పవన్ తో గణేష్ కు విబేధాలు ఉన్నాయా..? అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇక అంతేకాకుండా ఒక వాయిస్ నోట్ లో బండ్ల మాట్లాడుతూ “జీవితంలో ఎవరినీ నమ్ముకోవద్దు.. మీ తల్లి దండ్రులని నమ్మండి.. నిన్ను నమ్మి నీతో వచ్చిన మీ భార్యని ప్రేమించండి.. వారికి మంచి జీవితాన్ని ఇద్దాం. మన పిల్లలకు మంచి దారి చూపిద్దాం.. వాళ్ళ వీళ్ళ మోజులో పడి మన పిల్లలకు మనల్ని నమ్ముకున్నవారికి అన్యాయం చెయ్యొద్దు” అంటూ చెప్పడం మరింత హీట్ ను పెంచింది. ఎవరిని నమ్మొద్దు అని బండ్ల అంటున్నాడు.. ఇప్పుడు ఎందుకు బండ్ల గణేష్ ఇంత వేదాంతం వచ్చే మాటలు మాట్లాడుతున్నాడు అని పవన్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయమై బండ్లన్న ఏదైనా క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.
https://twitter.com/ganeshbandla/status/1538043668778872832?s=20&t=3t8tkUjDowQDkFHBPM1f6g