రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల వేళ అధికార ప్రతిపక్ష నాయకులు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ నియమించిన బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
TS BJP Leaders Nominations: తెలంగాణ రాష్ట్రంలో నేటితో నామినేషన్ల పర్వం ముగియనుంది. ఈ నేపథ్యంలో నేడు బీజేపీ నుంచి నలుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు.
తనను ఓడించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కుమ్కక్కై కుట్రలు చేస్తున్నాయని, అందులో భాగంగానే నామినేషన్ల పర్వం ప్రారంభమైనా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధిని ఇంతవరకు ప్రకటించలేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమ సంక్షోభానికి కారణం ముమ్మాటికీ బీఆర్ఎస్ ప్రభుత్వానిదే బాధ్యత అని పేర్కొన్న బండి సంజయ్ నాటి మంత్రి కేటీఆర్ తాను ప్రతిపాదించిన కొన్ని కంపెనీల వద్దే యార్న్ కొనుగోలు చేయాలని షరతు పెట్టడంతో అధిక ధరకు…
ఆగస్ట్ లో రైతు రుణమాఫీ చేస్తా అని కాంగ్రెస్ బోగస్ మాటలు చెబుతోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందడానికి కాంగ్రెస్ పార్టీ చూస్తోందన్నారు. జూన్ లో రుణమాఫీ చేయాలని 5700కోట్ల రూపాయలు లేని ప్రభుత్వం 30 వేల కోట్ల రూపాయలు రుణమాఫీ ఎలా చేస్తుందని ప్రశ్నించారు. ప్రజలను తిరిగి మోసం చేయాలని చూస్తోందన్నారు.
బండి సంజయ్ సమక్షంలో హుస్నాబాద్కు చెందిన పలువురు మాజీ సర్పంచులు బీజేపీలో చేరారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ ప్రసంగించారు. ఎకరాకు రూ.14 వేల బోనస్ ఎందుకివ్వడం లేదని.. తాలు, తరుగు, తేమతో పనిలేకుండా వడ్లు ఎందుకు కొనడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని బండి సంజయ్ ప్రశ్నించారు.
Ponnam Prabhakar: తల్లిని రాజకీయాలకు తల్లిని ఎందుకు లాగుతున్నారు అంటూ బండి సంజయ్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. కరీంనగర్ జిల్లా అంబేద్కర్ స్టేడియంలో మంత్రి పొన్నం మార్నింగ్ వాక్ చేస్తూ ప్రజలతో ముచ్చటించారు.
దేవుడి పేరుతో బండి సంజయ్ రాజకీయ నాటకాలు ఆడుతున్నారని పొన్నం ప్రభాకర్ చెప్పారు. సీట్లు ఓట్ల కోసం తల్లిని కూడా బండి సంజయ్ అవమానించాడు.. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ప్రసాదం స్కీమ్ ను వేములవాడ, కొండగట్టు, ధర్మపురి ఆలయాలకి బండి సంజయ్ ఒక్క రూపాయి తీసుకు రాలేదన్నారు.
BJP Namination: నేటి నుంచి తెలంగాణలో లోక్ సభ ఎన్నికలకు నామినేషన్ల దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ప్రారంభకానుంది. అయితే.. ఈ నేపథ్యంలోనే ఇవాల్టి నుండి బీజేపీ అభ్యర్థుల నామినేషన్లు వివరాలను బీజేపీ విడుదల చేసింది.
కరీంనగర్ లోని వికాస తరంగిణి ఆధ్వర్యంలో జరిగిన శ్రీ సీతారాముల కల్యాణంలో త్రిదండి చిన్నజీయర్ స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్న జీయర్ స్వామిని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ దర్శించుకున్నారు.
కరీంనగర్ లోని డ్రైనేజీ త్రాగునీరు సమస్యలను తెలుసుకునేందుకు 21వ డివిజన్లో ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ పర్యటించారు. 21 డివిజన్లో డ్రైనేజీ వసతులు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని బండి సంజయ్ అన్నారు. బోర్ నీళ్లలో కూడా డ్రైనేజీ వాటర్ కలవడంతో నీరు దుర్వాసన కొడుతోందని ఆయన వెల్లడించారు. కార్పొరేషన్ పరిధిలోనే ఉన్న 21వ డివిజన్లో అభివృద్ధి పనులను కార్పొరేషన్ ఆదిమరిచిందన్నారు. 21 డివిజన్ పాకిస్తాన్లో ఉందా బంగ్లాదేశ్ లో ఉందా అని ఆయన ప్రశ్నించారు.…