Bandi Sanjay : అధికారం ఊడబీకినా కేటీఆర్ అహంకారం తగ్గలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి రాగానే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఆరోపణలను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ కొట్టిపారేశారు. ఓడిపోతారనే భయంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్కక్కై ఒకే స్వరాన్ని విన్పిస్తూ ప్రజల్లో భయందోళనలను స్రష్టిస్తున్నాయని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయా నేతలకు సవాల్ విసిరారు ‘‘డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి అనుగుణంగా రిజర్వేషన్లను బీజేపీ ప్రభుత్వం యధాతథంగా కొనసాగిస్తుంది. ఈ మాటకు మేం కట్టుబడి ఉన్నాం. ఇదే విషయంపై బీజేపీ పక్షాన నేను ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నా. మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డిని కూడా ఒప్పించి తీసుకొస్తా.. డేట్, టైం, వేదిక మీరే ఫిక్స్ చేయండి. అదే సమయంలో రాజ్యాంగ స్పూర్తికి భిన్నమైన, సుప్రీం తీర్పుకు వ్యతిరేకమైన ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని ప్రమాణం చేసే దమ్ము మీకుందా?’’అని సీఎం, కేటీఆర్ లకు సవాల్ విసిరారు. రిజర్వేషన్ల రద్దు పేరుతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు కుమ్కక్కై ప్రజల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీసే కుట్ర చేస్తున్నాయని మండిపడ్డారు.
బండి సంజయ్ అవినీతిపరుడంటూ కేటీఆర్, పొన్నం ప్రభాకర్ చేసిన ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు. ‘‘నేను అవినీతికి పాల్పడితే ఇన్నాళ్లు అధికారంలో ఉన్నది మీరే కదా… నాపై ఎందుకు చర్యలు తీసుకోలే? ఎందుకు ఆధారాలు చూపలే. 10 ఏళ్లు అధికారంలో ఉండి ఏం పీకినవ్. మీ ఆస్తిపాస్తులపై, నా ఆస్తిపాస్తులపై విచారణకు సిద్ధమా? నేను రడీ… అట్లాడే అవినీతి, ఆస్తులపై దేవుడి ముందు ప్రమాణం చేసేందుకు సిద్దమా?..’’అంటూ సవాల్ విసిరారు.
Also Read
- Bhindi Health Benefits: బెండకాయ జిగురును చూసి దూరం పెడుతున్నారా? ప్రయోజనాలు తెలిస్తే షాకే..!
- Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
- EPFO ECR Filing Deadline: వేతన పరిమితి మార్పులతో ECR ఫైలింగ్‌లో మార్పులు.. EPFO కీలక నిర్ణయం
- Nepal: చైనాను కాదని, భారత్‌కే ఓటేసిన నేపాల్ ప్రధాని..
ఈరోజు ఉదయం కరీంనగర్ లోని ఎంపీ కార్యాలయంలో వివిధ టీవీ ఛానళ్ల ప్రతినిధులు బండిసంజయ్ ను కలిసి రిజర్వేషన్ల రద్దు, హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్ చేసిన ఆరోపణలను ప్రస్తావించగా సంజయ్ పై విధంగా స్పందించారు. ఏమన్నారంటే…
తెలంగాణలో బీఆర్ఎస్ భూస్తాపితం కావడానికి ప్రధాన కారణం కేటీఆర్. జనం ఛీ కొట్టినా ఆయనకు అహంకారం తగ్గలేదు. కళ్లు నెత్తికెక్కి మాట్లాడుతున్నడు. అమెరికాలో చిప్పలు కడిగిన బతుకు నీది. మీ అయ్య లేకపోతే… నిన్ను కుక్కలు కూడా దేఖవు. అమెరికాలో రబ్బరు చెప్పులు, ముడతల చొక్కతో తిరిగే నువ్వు మీ అయ్య టీఆర్ఎస్ పెడితే వచ్చి సిరిసిల్ల టిక్కెట్ పై పోటీ చేసి కేకే మహేందర్ రెడ్డి పొట్ట కొట్టిన నీచుడివి. అధికారంలో ఉంటూ కేటీఆర్ చేసి అవినీతి, అక్రమాల చిట్టాతోపాటు ఆయన భాగోతమంతా బయటకు తీస్తున్నా. త్వరలోనే ప్రజల ముందు పెడతా.
నేను మా అయ్య పేరు చెప్పుకుని రాలే. 1994లోనే అర్బన్ బ్యాంకు డైరెక్టర్ గా గెలిచిన. ఆ తరువాత కూడా మళ్లీ డైెరెక్టర్ గా గెలిచిన. 2005 నుండి రెండు సార్లు కార్పొరేటర్ గా పోటీ చేసిన గెలిచిన. 2014, 18లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన. 2019లో ఎంపీగా పోటీ చేసి 89 వేలకుపైగా మెజారిటీతో గెలిచిన.
బండి సంజయ్ 5 ఏళ్లు గాలి తిరుగుళ్లు, గాలి మాటలు చెప్పుడు తప్ప ఏం తెలుసని అంటావా? మీ లెక్క గాలి మాటలు చెప్పి వేల కోట్లు దోచుకోవడం నాకు తెల్వదు. మీ చెల్లి లెక్క గాలి మాటలు చెప్పి పంజాబ్, ఢిల్లీలో లిక్కర్ దందాలు చేయడం తెల్వదు…
అకాల వర్షాలతో రైతులు పంట నష్టపోయి అల్లాడుతుంటే అధికారంలో ఉండి కేసీఆర్ నయాపైసా ఇయ్యకపోతే వాళ్ల దగ్గరకు పోయి అండగ నిలిచిన. రుణమాఫీ ఇయ్యకుంటే, వడ్లు కొనకపోతే రైతుల పక్షాన పోరాడిన… నిరుద్యోగులకు ఉద్యోగాలియ్యకుండా రోడ్డునపడేస్తే వాళ్ల పక్షాన కొట్లాడి జైలుకు పోయిన. 317 జీవో సవరించాలని ఉద్యోగులు రోడ్డున పడితే వాళ్ల పక్షా ధర్నాలు చేసి జైలుకు పోయిన. ప్రజా సమస్యలపై ఐదేళ్లపాటు లాఠీదెబ్బలు తిన్న. వందల కేసులు పెట్టినా వెరవకుండా పోరాడిన. మీ ద్రుష్టిలో ఇవన్నీ గాలి తిరుగుళ్లా? ప్రజా సమస్యలను గాలికొదిలేసి, ప్రశ్నించిన వాళ్లను రాచిరంపాన పెట్టి మీరు మాత్రం విదేశాలకు వెళ్లి వేల కోట్లు దాచి పెట్టుకోవడమే మీ ద్రుష్టిలో మంచి తిరుగుళ్లా?.. సిగ్గుండాలే. జనం గద్దె దించి మీ కుటుంబాన్ని ఛీ కొట్టినా ఇంకా బుద్దిరాలే. జూన్ 4 తరువాత జనం బీఆర్ఎస్ పార్టీని పాతాళంలోకి తొక్కబోతున్నరు. అప్పుడైనా మీకు బుద్ది రావాలని కోరుకుంటున్నా..’ అని బండి సంజయ్ అన్నారు.
తాజావార్తలు
-
EC Orders Voter List Revision in 17 States: ఓటర్లకు కీలక సమాచారం.. 17 రాష్ట్రాల్లో ఓటరు జాబితాల సవరణకు ఈసీ ఆదేశాలు!
-
Telangana Inter Exam Fee : తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల..
-
Kim Jong Un: కిమ్ కొత్త క్షిపణి ప్రయోగం.. దడదడలాడిన దక్షిణ కొరియా!
-
iPhone Duo Repair Cost: రూ.3 లక్షల iPhone Duo.. స్క్రీన్ రిపేర్‌కే రూ.1.49 లక్షలు! రిపేర్ ధరల పూర్తి జాబితా ఇదే
-
January 12 Vidudala నుంచి ఫస్ట్ సింగిల్ రెడీ! అనిల్ రావిపూడి ప్లాన్ ఇదేనా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!