B Vinod Kumar: కరీంనగర్ ఎంపీ ఎన్నికల్లో బండి సంజయ్ వినోద్ కుమార్ మధ్యనే పోటీ ఉందని బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాకర్స్ తో కలిసి ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. గతంలో హుజురాబాద్ నియోజకవర్గం నుండి నాకు మంచి మెజార్టీ వచ్చింది ఈసారి కూడా మంచి మెజార్టీ ఇవ్వాలని కోరుతున్నా అన్నారు. ఆనాడు చంద్రబాబు నాయుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి 17 మంది ఎంపీలతో తెలంగాణ ఎలా వస్తుందని ఎద్దేవా చేశారు. పార్లమెంటులో తెలంగాణ ప్రజల సమస్యల పట్ల గొంతుక వినిపించేందుకు టిఆర్ఎస్ పార్టీ ఎంపీలను గెలిపించాలన్నారు. ఎంపీగా నన్ను గెలిపిస్తే సింగపూర్ లోని ఇనిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజికల్ ఎడ్యుకేషన్ నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని కరీంనగర్ కు తీసుకువస్తా అన్నారు.
Read also: USA: అమెరికాలో దారుణం.. మరో నల్లజాతీయుడి ప్రాణాలు తీసిన పోలీసులు
పార్లమెంటు పరిధిలోని ఐదు నియోజకవర్గాల యువతకు గొప్ప అవకాశాలు వచ్చేందుకు కృషి చేస్తా అన్నారు. జమ్మికుంట హుజురాబాద్ మున్సీపాలిటీలను తీర్చిదిద్దేందుకు ఒక గొప్ప పథకంతో వస్తానని తెలిపారు. ఎంపీగా గెలిచిన బండి సంజయ్ ఐదేళ్లలో ఐదు రూపాయలు కూడా తీసుకురాలేదన్నారు. కరీంనగర్ సిరిసిల్ల జిల్లా పరిషత్ కార్యక్రమంలో పాల్గొనని ఎంపీ ఎవరైనా ఉన్నారంటే అది ఒక బండి సంజయ్ మాత్రమే అని తెలిపారు. ఇచ్చిన హామీలు ఒకటి కూడా నెరవేర్చలేదు కాబట్టే కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరించారని అన్నారు. కరీంనగర్ ఎంపీ ఎన్నికల్లో బండి సంజయ్ వినోద్ కుమార్ మధ్యనే పోటీ ఉందన్నారు. కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధి జరగాలంటే టిఆర్ఎస్ అభ్యర్థిగా నన్ను గెలిపించాలని కోరారు.
Priyadarshini: నీటి సమస్యను తీర్చమన్న మహిళలపై కేంద్రమంత్రి భార్య చిందులు