Off The Record: సెక్రటేరియట్ గోడలకు చెవులు పెరిగిపోయాయి. ప్రభుత్వ విధాన నిర్ణయాలపై అలా చర్చించి, చర్చించగానే ఇలా కొన్ని బయటపడుతున్నాయి. ప్రతిపక్షాలకు ఆయుధాలవుతున్నాయి. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి లీకుల భయం పట్టుకుంది. అధికారంలోకి వచ్చిన కొత్తలో జరిగిన కొన్ని ఘటనలు మర్చిపోక ముందే మళ్ళీ ప్రభుత్వ సమాచారం క్షణాల్లో ప్రతిపక్షాలకు చేరుతోంది. ప్రభుత్వంలోని ముఖ్య శాఖల్లో జరిగే నిర్ణయాలు బయటకు లీక్ అవుతున్నాయని భావిస్తున్నారు. అంతర్గత సమావేశాల సారాంశం ప్రభుత్వ పెద్దల కంటే ముందే ప్రతిపక్షానికి…
MP Kirankumar Reddy: బీజేపీ మాజీ మంత్రి కేటీఆర్‌పై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పదేండ్లు అబద్దాలు ఆడిన శిశు పాలుడు పామ్ హౌస్ లో పడుకుండు.. కేటీఆర్ రెండు వేసుకొని ఖమ్మం పోయినట్లు ఉండు అని కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తొందరగా ఐదేండ్లు పూర్తి కావాలని కేటీఆర్ తహతహాలాడుతుండు అని, రేవంత్ రెడ్డి లీకు వీరుడా.. గ్రీకు వీరుడా.. అనేది ఫామ్ హౌస్ కు పోయి…
మెదక్ జిల్లా ఇందిరాగాంధీ ఖిల్లా అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కేసీఆర్ సీఎం ఉన్నప్పుడు వెలగబెట్టింది ఏమీ లేదన్నారు. మెదక్ లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన భారీ ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ఉద్యమ నాయకుడని కేసీఆర్ ని గెలిపిస్తే అప్పుల కుప్ప చేసి తెలంగాణని దోచుకున్నారని విమర్శించారు. ఏడున్నర లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కేసీఆర్ ఫామ్ హౌస్ లో నిద్రపోతున్నారని ఆరోపించారు.