Supreme Court: 13 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా ఉపయోగించకుండా నిషేధించాలనే పిటిషన్‌ని ఈ రోజు సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ పిటిషన్‌ని విచారించేందుకు నో చెప్పింది. ఇది విధానపరమైన విషయమని, మీరు పార్లమెంట్ చట్టం చేయాలని అడగాలని ధర్మాసనం పిటిషనర్‌ని ఉద్దేశించి వ్యాఖ్యానించింది. జస్టిన్ బీఆర్ గవాయ్, అగస్టిన్ జార్జ్ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం, దీనిపై సంబంధిత అధికార యంత్రాంగానికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి స్వేచ్ఛని ఇచ్చింది.
Pakistan: మొహర్రం పండగ సందర్భంగా పాకిస్తాన్ సోషల్ మీడియాపై బ్యాన్ విధించేందుకు సిద్ధమవుతోంది. యూట్యూబ్, వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్‌ఫారమ్స్ బ్యాన్‌పై ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నిర్ణయం తీసుకోబోతున్నారు.
Pakistan: పాకిస్తాన్ వ్యాప్తంగా సోషల్ మీడియా సైట్లను నిషేధించాలని ఆ దేశంలోని చట్టసభలో తీర్మానం ప్రవేశపెట్టారు. సోషల్ మీడియ సైట్లపై బ్యాన్ విధించాలని సెనెట్‌లో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ)కి చెందిన సెనెటర్ బహ్రమంద్ టాంగీ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఫేస్‌బుక్, టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్ వంటి వాటిని నిషేధించాలని తీర్మానంలో కోరారు. మార్చి 11తో సెనేటర్‌గా పదవీకాలం ముగియబోతున్న తరుణంలో టాంగీ ఈ తీర్మానాన్ని తీసుకురావడం గమనార్హం.
తీవ్ర సంక్షోభంలో వున్న శ్రీలంకలో జనం నానా అవస్థలు పడుతున్నారు. ఆర్థిక సంక్షోభం అత్యంత తీవ్రరూపు దాల్చింది. ధరలు ఆకాశాన్నంటుతుండడం, నిత్యావసరాల కొరత, ద్రవ్యోల్బణం వంటి అంశాలతో లంకేయులు అల్లాడిపోతున్నారు. దీంతో దేశంలో అరాచక పరిస్థితులు నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి. శ్రీలంక ప్రభుత్వం 36 గంటల పాటు లాక్ డౌన్ ప్రకటించింది. దీనికి తోడు సోషల్ మీడియాపై ఆంక్షలు విధించింది. దేశవ్యాప్తంగా అనేక చోట్ల అస్థిరత రాజ్యమేలుతుండడంతో ఈ కర్ఫ్యూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సోమవారం…