ప్లాస్టిక్ వస్తువులతో ఉత్పన్నమయ్యే కాలుష్యాన్ని తగ్గించడంలో భాగంగా రాష్ట్రంలో ఇకపై ప్లాస్టిక్ ఫ్లెక్సీలు, బ్యానర్లను నిషేధిస్తున్నట్టు ఈ మధ్యే ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి… ఇకపై క్లాత్‌తో తయారు చేసిన ఫ్లెక్సీలను మాత్రమే వినియోగించాలని సూచించారు. విశాఖపట్నం ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో ‘పార్లే ఫర్ ది ఓషన్స్’ సంస్థతో ఏపీ ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు సీఎం వైఎస్ జగన్.. అయితే, ఇవాళ రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీ…