Pakistan: పాకిస్తాన్ తన సొంత ప్రజల్ని మాయం చేస్తోంది. బలూచిస్తాన్‌లో తమ హక్కుల గురించి నినదించిన వారు క్రమంగా ‘‘అదృశ్యం’’ అవుతున్నారు. వారు ఏమయ్యారో, ఎక్కడ ఉన్నారో తెలియని పరిస్థితి. తమ వారు ప్రాణాలతో ఉన్నారా లేదా అనే విషయం తెలియక అక్కడి కుటుంబాలు అల్లాడిపోతున్నాయి.
పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో స్వాతంత్ర్యం కోసం డిమాండ్ పెరుగుతోంది. కొన్ని రోజుల క్రితం, బలూచ్ నేషనల్ మూవ్‌మెంట్ ‘ఆపరేషన్ బామ్ (ఉదయం)’ ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ ఆపరేషన్ కింద, బలూచ్ జాతీయ ఉద్యమ యోధులు పాకిస్తాన్‌లోని పంజ్‌గుర్, సుర్బ్, కెచ్, ఖరాన్‌లతో సహా అనేక జిల్లాల్లో దాదాపు 17 దాడులు చేశారు. ఇదిలా ఉండగా, బలూచిస్తాన్ “ఎప్పటికీ పాకిస్తాన్‌లో భాగం కాదు” అని బలూచ్ నేషనల్ మూవ్‌మెంట్ (BNM) సమాచార కార్యదర్శి ఖాజీ దాద్ మొహమ్మద్ రెహాన్…
బలూచిస్తాన్‌లో బలవంతంగా బలూచ్‌లు అదృశ్యం కావడం పెరుగుతున్న ధోరణిపై మానవ హక్కుల సంస్థలు పాకిస్తాన్ ప్రభుత్వాన్ని విమర్శించాయి. దీనిని మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన నేరంగా అభివర్ణించాయి. బలూచిస్తాన్ నుంచి పాకిస్తాన్ సైన్యం మరో ఏడుగురు బలూచ్‌లను బలవంతంగా అదృశ్యం చేసిందని బలూచ్ జాతీయ ఉద్యమ మానవ హక్కుల విభాగం తెలిపింది. బాధితులను తరచుగా ఎటువంటి చట్టపరమైన ప్రక్రియ లేకుండానే తీసుకెళ్తారు. వారి గురించి వారి బంధువులకు ఎటువంటి సమాచారం ఇవ్వరు. మస్తుంగ్‌లోని కిల్లి షేఖాన్ ప్రాంతం నుంచి…
Pakistan : ప్రత్యేక దేశం కోరుతూ పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో చాలా కాలంగా నిరంతర ప్రదర్శనలు జరుగుతున్నాయి. అక్కడి ప్రజలు నిరంతరం పాకిస్తాన్ సైన్యం నిరంకుశ ప్రవర్తనకు గురవుతున్నారు.