Minuteman 3 Missile: అమెరికా వైమానిక దళానికి చెందిన గ్లోబల్ స్ట్రైక్ కమాండ్ కాలిఫోర్నియా నుంచి నిరాయుధ మినిట్‌మ్యాన్ III ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి (ICBM)ను పరీక్షించింది. ఇది ఒక సాధారణ పరీక్ష అని అగ్రరాజ్యం పేర్కొంది. ఈ క్షిపణి మార్షల్ దీవులకు సమీపంలోని రోనాల్డ్ రీగన్ బాలిస్టిక్ క్షిపణి రక్షణ పరీక్షా స్థలంలో పడినట్లు సైన్యం ప్రకటించింది. అధ్యక్షుడు ట్రంప్ అణ్వాయుధాలపై చేసిన వ్యాఖ్యల తర్వాత ఈ పరీక్ష జరగడం విశేషం. READ ALSO: Tatiparthi…
Tayfun Block-4: పాకిస్తాన్‌తో ఫ్రెండ్‌షిప్ చేస్తున్న టర్కీ ఇప్పుడు తన మొదటి ‘‘హైపర్‌సోనిక్ బాలిస్టిక్ మిస్సైల్’’ని తయారు చేసింది. ‘‘టేఫన్ బ్లాక్’’ అనే క్షిపణిని ఇస్లాంబుల్‌లో జరిగిన అంతర్జాతీయ రక్షణ పరిశ్రమ ప్రదర్శన (IDEF) 2025లో ప్రదర్శించింది. ఈ కొత్త క్షిపణిని టర్కిష్ రక్షణ సంస్థ రోకెట్సన్ డెవలప్ చేసింది. ఇది టర్కీ దేశీయంగా తయారు చేసిన అత్యంత పొడవైన బాలిస్టిక్ మిస్సైల్ అయిన టేఫన్‌కు హైపర్సోనిక్ వెర్షన్.
US- Pakistan: దీర్ఘశ్రేణి క్షిపణి టెక్నాలజీ వ్యాప్తికి హెల్ప్ చేస్తున్నారంటూ పాకిస్థాన్ కు చెందిన నాలుగు సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించింది. పాక్ అలాంటి మిస్సైల్స్ తయారు చేయడం వల్ల తమకు సైతం ముప్పు పొంచి ఉందని అమెరికా డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ జోన్ ఫైనర్ పేర్కొన్నారు.
INS Arighaat: భారత్‌కు చెందిన అణు జలాంతర్గామి ఐఎన్‌ఎస్ అరిఘాత్ నుంచి కే4 బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించారు. విశాఖ తీరంలో భారత నౌకాదళం దీనిని నిర్వహించిందని రక్షణ రంగ అధికారులు చెప్పారు. అరిఘాత్ నుంచి కే4 క్షిపణిని పరీక్షించడం ఇదే మొదటిసారి.
ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించినట్లు జపాన్ ప్రధాన మంత్రి కార్యాలయం సోమవారం అనుమానం వ్యక్తం చేసింది. ఉత్తర కొరియా సోమవారం తూర్పు సముద్రం వైపు పేర్కొనబడని బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిందని దక్షిణ కొరియా సైన్యం తెలిపింది.
ఉత్తర కొరియా తన ఈశాన్య తీరప్రాంత జలాల్లో అనేక బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని దక్షిణ కొరియా సైన్యం తెలిపింది. కొరియా ద్వీపకల్పంలో ఇప్పటికే తీవ్ర ఉద్రిక్తతల మధ్య జనవరి నుంచి ఉత్తర కొరియాకు ఇది ఐదవ పరీక్ష జరిపినట్లు పేర్కొనింది.
ఉత్తర కొరియా ఒక ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. అది కొరియా ద్వీపకల్పంతో పాటు జపాన్ మధ్య సముద్రంలో పడిపోయింది. ఈ క్షిపణి ఈ ప్రాంతంలోని రిమోట్ ద్వారా అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేకుని ప్రయోగించింది.
Pakistan: పాకిస్తాన్ ఆప్తమిత్రుడు చైనా ఆ దేశానికి కావాల్సిన అన్ని సాయాలు చేస్తోంది. భారత్ని ఇరుకున పెట్టేందుకు పాకిస్తాన్కి అన్ని విధాల సహాయపడుతోంది. తాజాగా చైనాకు చెందిన కొన్ని కంపెనీలు పాకిస్తాన్కి బాలిస్టిక్ మిస్సైల్ కార్యక్రమానికి సంబంధించి కీలక వస్తువులు, సాంకేతికతను సరఫరా చేసింది. దీనిపై ఆగ్రహించిన అమెరికా, చైనాలోని మూడు కంపెనీలపై ఆంక్షలు విధించింది. గ్లోబల్ నాన్ప్రొలిఫరేషన్ రిజిమ్లో భాగంగా ఈ మూడు కంపెనీలపై ఆంక్షలు విధిస్తున్నట్లు యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ శుక్రవారం తెలిపింది.
ఉత్తర కొరియా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. తమ గగనతలాన్ని ఉల్లంఘించిన యూఎస్ గూఢచారి విమానాలను కూల్చివేస్తామని ఉత్తర కొరియా బెదిరించిన మరునాడే ఈ పరీక్ష నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. ఉత్తర కొరియా జపాన్ సముద్దం అని పిలవబడే తూర్పు సముద్రం వైపు బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిందని జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చెప్పారు.