US- Pakistan: పాకిస్థాన్ క్షిపణులతో మాకు ప్రమాదం పొంచి ఉంది..
- దీర్ఘశ్రేణి క్షిపణి టెక్నాలజీ వ్యాప్తికి సహాయం చేస్తున్నారని పాక్కు చెందని నాలుగు కంపెనీలపై ఆంక్షలు..
- పాకిస్థాన్ దీర్ఘశ్రేణి క్షిపణులను అభివృద్ధి చేయడం అమెరికాతో పాటు దక్షిణాసియా దేశాలకు ముప్పు..
- పాక్ తయారు చేస్తున్న దీర్ఘశ్రేణి ఆయుధాల తయారీని నిశితంగా పరిశీలిస్తున్నాం: అమెరికా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US- Pakistan: దీర్ఘశ్రేణి క్షిపణి టెక్నాలజీ వ్యాప్తికి హెల్ప్ చేస్తున్నారంటూ పాకిస్థాన్ కు చెందిన నాలుగు సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించింది. పాక్ అలాంటి మిస్సైల్స్ తయారు చేయడం వల్ల తమకు సైతం ముప్పు పొంచి ఉందని అమెరికా డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ జోన్ ఫైనర్ పేర్కొన్నారు. కాగా, పాకిస్థాన్ దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణులను అభివృద్ధి చేయడం అమెరికాతో పాటు దక్షిణాసియా దేశాలకు అతి పెద్ద ముప్పు అని చెప్పుకొచ్చారు. అందుకే ఆ దేశానికి చెందిన నాలుగు సంస్థలపై ఆంక్షలు విధిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. 2021లో ఆఫ్గనిస్థాన్ నుంచి యూఎస్ దళాలు వైదొలిగిన తర్వాత పాక్ తో ఒకప్పటి సంబంధాలు కొనసాగడం లేదన్నారు.
Read Also: AP News: పెనమలూరులో సీఎం, సాలూరులో డిప్యూటీ సీఎం పర్యటన!
Also Read
- America: హౌతీలతో లోపయకారి ఒప్పందం.. సౌదీని రోడ్డున పడేసిన అగ్రరాజ్యం!
- Greenland Deal: ట్రంప్ ఆశ నెరవేరింది.. గ్రీన్‌ల్యాండ్‌పై డెన్మార్క్‌తో డీల్..
- Trump-Jinping: 24న వైట్‌హౌస్‌లో జిన్‌పింగ్‌కు విందు.. మస్క్, సుందర్ పిచాయ్, టిమ్ కుక్కు ఆహ్వానం
- Explainers: భూమి గుండెల్లో దాగిన నీటి రహస్యం.. ఏకంగా 660 కిలోమీటర్ల లోతులో..
కాగా, మరోవైపు పాకిస్థాన్ దీర్ఘశ్రేణి క్షిపణుల తయారీకి సపోర్ట్ ఇచ్చేందుకు అమెరికా చాలా కాలం నుంచి నిరాకరిస్తుందని యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ డిప్యూటీ స్పోక్స్ పర్సన్ వేదాంత్ పటేల్ వెల్లడించారు. అయితే, అవి ఇరుదేశాలకు సంబంధించిన ఇతర రంగాలను ప్రభావితం చేయవని ఆయన చెప్పుకొచ్చారు. ప్రపంచంలో అణ్వస్త్ర వ్యాప్తి నిరోధనకు అమెరికా కట్టుబడి ఉందని తేల్చి చెప్పారు. పాక్ తయారు చేస్తున్న దీర్ఘశ్రేణి ఆయుధాల తయారీని నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపారు.
Read Also: Truck Blast In Jaipur: జైపూర్‌లోని పెట్రోల్ బంక్ వద్ద అగ్ని ప్రమాదం.. ఐదుగురు మృతి
అయితే, దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణి టెక్నాలజీ వ్యాప్తికి సహకరిస్తున్న పాక్‌కు చెందిన నాలుగు సంస్థలపై అమెరికా ఆంక్షలు పెట్టింది. ఈ జాబితాలో పాక్ ప్రభుత్వరంగానికి చెందిన నేషనల్ డెవలప్‌మెంట్ కాంప్లెక్స్, అక్తర్ సన్స్ ప్రైవేట్ లిమిటెడ్, అఫిలియేట్స్ ఇంటర్నేషనల్, రాక్‌సైడ్ ఎంటర్‌ప్రైజెస్ ఉన్నాయి. అయితే, ఈ మూడు కంపెనీలు కరాచీ కేంద్రంగా పని చేస్తున్నాయి. ఇక, అమెరికా విధించిన ఆంక్షలు పక్షపాతంతో కూడుకున్నవిగా పాక్ సర్కార్ ఆరోపించింది. సైనికపరమైన అసమానతలను సృష్టిస్తే ప్రాంతీయంగా అస్థిరత నెలకొంటుందని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Vijay Sethupathi: సీఎం విజయ్ ఫోన్ చేశాడు.. ఆ సీక్రెట్ కాల్ ముచ్చట్లు బయటపెట్టిన సేతుపతి..!
-
Punjab: మాజీ కేంద్ర మంత్రి అరెస్ట్.. పంజాబ్‌లో హై-వోల్టేజ్ డ్రామా..
-
America: హౌతీలతో లోపయకారి ఒప్పందం.. సౌదీని రోడ్డున పడేసిన అగ్రరాజ్యం!
-
LPG UPI Payments: కొత్త యూపీఐ నిబంధన.. ఎల్పీజీ సిలిండర్లపై తీవ్ర ప్రభావం..?
-
CM Chandrababu: రాజముద్ర వేసి ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం.. మిగిలిన వారికి కూడా ఇస్తాం..
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!