నటసింహం నందమూరి బాలకృష్ణ అనారోగ్యం పాలైన తన అభిమానికి ఆసుపత్రిలో కన్పించి సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. సీనియర్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన అభిమానిని కలిసి ధైర్యం చెప్పారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలయ్య అభిమాని అఖిల భారత నందమూరి బాలకృష్ణ అభిమానుల సంఘం కన్వీనర్. ఈ విషయాన్ని బాలయ్య స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. “మా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స…
కరోనా సెకండ్ వేవ్ తరువాత పెద్ద సినిమాలన్నీ వరుసగా విడుదలకు సిద్ధమయ్యాయి. ఈ మేరకు రిలీజ్ డేట్లను కూడా ప్రకటించాయి. అయితే సీనియర్ హీరోల చిత్రాలైన ఆచార్య, అఖండ మాత్రం ఇంకా విడుదల తేదీలను ఖరారు చేయలేదు. అయితే తాజాగా జరుగుతున్న ప్రచారం ప్రకారం “అఖండ” అక్టోబర్ 13న విడుదలకు సిద్ధమవుతోందని తెలుస్తోంది. “ఆర్ఆర్ఆర్” ఇప్పటికే ఈ డేట్ ను లాక్ చేసినప్పటికీ ఆ సినిమా వాయిదా పడే అవకాశం ఉంది. కాబట్టి బాలయ్య అదే రోజున…
కోవిడ్ -19 సెకండ్ వేవ్ టాలీవుడ్ భారీ సినిమాలు వరుసగా విడుదల తేదీలను ప్రకటించేసాయి. 2022 సంక్రాంతికి పవన్, మహేష్, ప్రభాస్ ఖర్చీఫ్ వేసేశారు. “ఆర్ఆర్ఆర్”ను అక్టోబర్ 13న విడుదల చేస్తామని రాజమౌళి చెప్పాడు. కానీ ఆ విషయంపై ఇంకా క్లారిటీ లేదు. ఈ నెలాఖరులో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి విడుదల తేదీని ప్రకటిస్తారని అంటున్నారు. “ఆర్ఆర్ఆర్”ను సంక్రాంతికి రిలీజ్ చేయాలని రాజమౌళి భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అదే గనుక జరిగితే బాక్స్ ఆఫీస్ వద్ద…
ఒకప్పుడు మన హీరోలు స్పీడ్ గా సినిమాలు పూర్తి చేసేవారు. దాంతో ఒక్కో హీరో ఖాతాలో వందలాది సినిమాలు ఉంటూ వచ్చాయి. కాలం మారింది. పర్ ఫెక్షన్ పేరుతో ఏడాదికి ఒక సినిమా చేయటమే గగనంగా మారింది. దానికనుగుణంగా హీరోల కెరీర్ లో వంద సినిమాలు అనేది ఇంపాజిబుల్ టాస్క్ గా మారింది. ప్రత్యేకించి ఈ తరం హీరోలు వంద మార్క్ కు చేరటం తీరని కలగా మిగిలిపోతోంది. మన స్టార్ హీరోలలో చిరంజీవి 150కి పైగా…
నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం “అఖండ” సినిమాను పూర్తి చేస్తున్నారు. ఆ తరువాత గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఇంకా పేరు పెట్టని ప్రాజెక్ట్‌లో నటించబోతున్నారు. దర్శకుడు గోపీచంద్ మలినేని తన మునుపటి సినిమాల మాదిరిగానే నిజమైన సంఘటనల ఆధారంగా బాలయ్య కోసం ఒక పవర్ ఫుల్ స్క్రిప్ట్ రాశారు. ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్ ను నిర్మిస్తోంది. మ్యూజిక్ కంపోజర్ థమన్ ఈ ప్రాజెక్ట్ కు స్వరాలు సమకూర్చనున్నారు. ఈ…
‘మా’ ఎన్నికలు చర్చనీయాంశంగా మారడంతో ఎట్టకేలకు మెగాస్టార్ స్పందించారు. గతంలో ఎన్నడూ లేనంతగా మా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న సభ్యులు ఒకరిపై ఒకరు సంచలన ఆరోపణలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పోటీదారుల మధ్య చీలిక రావటం, ఎన్నడూ లేనంతగా పోటీదారుల సంఖ్య పెరుగుతుండటంతో ఈసారి ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, హేమ, బాలకృష్ణ, జీవిత, ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ వ్యాఖ్యలతో ‘మా’ ఎన్నికలు వివాదంగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో మెగాస్టార్…
నటసింహం నందమూరి బాలకృష్ణ ఈ రోజు “నాట్యం” అనే సినిమాలోని మొదటి సాంగ్ “నమః శివాయ”ను రిలీజ్ చేశారు. అనంతరం బాలయ్య మాట్లాడుతూ తన హిందూపూర్ నియోజకవర్గంలోని లేపాక్షి ఆలయంలో చిత్రీకరించబడిన పాటపై సంతోషం వ్యక్తం చేశారు. టీమ్ మొత్తాన్ని అభినందిస్తూ సినిమా విజయవంతం కావాలని కోరుకున్నారు. Read Also : “మహాసముద్రం” ఫస్ట్ సాంగ్… రంభకు మాస్ ట్రిబ్యూట్ “నమః శివాయ” వీడియో సాంగ్ శివుడికి ఆధ్యాత్మిక నివాళి. శ్రవణ్ భరద్వాజ్ స్వరపరిచిన ఈ పాటలో…
భారతదేశానికి 41 ఏళ్ల తర్వాత ఒలంపిక్స్ లో హాకీలో పతకం రావడం పట్ల మన తారలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పతకం గెలిచి దేశ ప్రతిష్టను పెంచిన హాకీజట్టుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు నందమూరి బాలకృష్ణ. హాకీ జట్టు కఠోర శ్రమతోనే పతకం లభించింది. దేశ ప్రజల ఆశీస్సులు, మన్ననలు క్రీడా కారులకు ఎల్లవేళలా వుంటాయి. దేశం గర్వించేలా ఒలంపిక్స్ లో క్రీడాకారులు పోరాడుతున్నారు. ఒలంపిక్స్ లో ఇతర క్రీడాకారులు కూడా మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను…
నందమూరి నటసింహం బాలకృష్ణ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “అఖండ” షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ చిత్రం క్లైమాక్స్ చిత్రీకరణలో ఉంది. మాస్ డైరెక్టర్ బోయపాటి ఈ మూవీని భారీ రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. టీజర్ తోనే ఫుల్ గా హైప్ పెంచేసాడు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యాక బాలయ్య, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇప్పటికే డైరెక్టర్ గోపీచంద్ సినిమా కథ గురించి తన పరిశోధనల అనంతరం స్క్రిప్ట్ ను…
ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేసి, ‘అభినయ శారద’గా పేరు తెచ్చుకున్న నటి జయంతి. తెలుగుతో పాటు కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో 500లకు పైగా సినిమాలు చేశారు. ఆమె మృతి పట్ల నందమూరి బాలకృష్ణ ప్రగాఢ సంతాపం తెలియజేశారు. నందమూరి బాలకృష్ణగారు మాట్లాడుతూ “జయంతిగారు గొప్ప నటి. అప్పటినుంచి ఇప్పటివరకూ అనేక తరాలతో కలిసి పనిచేసిన సీనియర్ నటీమణి. నాన్నగారి ‘జగదేకవీరుని కథ’ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమై, తర్వాత ‘కుల గౌరవం’, ‘కొండవీటి సింహం’,…