‘నార్పప్ప’ సినిమా విడుదలైన నేపథ్యంలో సీనియర్ హీరోలు, వారు చేస్తున్న, ఇటీవల చేసిన పాత్రలు మరోసారి ఫిల్మ్ నగర్ వర్గాలలో చర్చకొచ్చాయి. ‘అసురన్’ మూవీలో యంగ్ హీరో ధనుష్ మధ్య వయస్కుడి పాత్రలో ఒదిగిపోయాడు కానీ దాని రీమేక్ గా తెరకెక్కిన ‘నారప్ప’లో వెంకటేశ్ యంగ్ గెటప్ లో మెప్పించలేకపోయాడనే విమర్శలు వచ్చాయి. అందులో యంగ్ నారప్పకు జోడీగా నటించిన అమ్ము అభిరామికి వెంకటేశ్ కు వయసులో ఎంతో వ్యత్యాసం ఉండటం వల్ల ఆ జోడీ జనాలను…
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “అఖండ”. ఇప్పుడు ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తాజాగా ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ ప్రారంభమైంది. ఈ చిత్ర నిర్మాతలు తమిళనాడులోని లొకేషన్ లో క్లైమాక్స్ షూటింగ్ ప్రారంభించారు. ప్రస్తుతం తమిళనాడులోని ఒక ఆలయంలో షూటింగ్ జరుగుతోంది. ప్రధాన నటుడితో పాటు మిగతా నటీనటులు కూడా సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు. సమాచారం ప్రకారం స్టంట్ కొరియోగ్రాఫర్ శివ ఒక యాక్షన్ సీక్వెన్స్ కొరియోగ్రాఫ్ చేసాడు. ఇది…
“ఆదిత్య 369” చిత్రం 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ట్రోలింగ్ మొదలైంది. “హూ ఈజ్ బాలయ్య” అంటూ నెటిజన్లు స్పెషల్ హైస్ ట్యాగ్ తో మండిపడుతున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీకి తమ కుటుంబం చేసిన కృషిని ఇలాంటి అవార్డులు భర్తీ చేయలేవని, భారతరత్న ఎన్టీఆర్ కాలిగోటితో, చెప్పు తో సమానం అని అన్నారు. Read Also : ఆర్ఆర్ఆర్ : ‘బిహైండ్ ది సీన్స్’ వీడియో…
నందమూరి బాలకృష్ణ, త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా ఉండబోతోంది అంటూ సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బాలయ్య మాట్లాడుతూ నెట్స్ట్ తాను చేయబోయే వరుస సినిమాల గురించి వెల్లడించారు. ప్రస్తుతం బోయపాటి “అఖండ”లో నటిస్తున్న ఆయన తదుపరి ప్రాజెక్ట్ గోపీచంద్ మలినేనితో ఉండబోతోందని వెల్లడించారు. అలాగే ఆ తరువాత అనిల్ రావిపూడితో ఓ చిత్రం, హాసిని అండ్ హారిక బ్యానర్ లో ఓ చిత్రం చేయబోతున్నట్టు ప్రకటించారు. Read Also : ‘మా’…
(జూలై 18న ‘ఆదిత్య 369’కు 30 ఏళ్ళు పూర్తి) నటసింహ నందమూరి బాలకృష్ణ కెరీర్ లో అనేక అద్భుత విజయాలు ఉన్నాయి. అయితే ఆయన కెరీర్ లోనే కాదు, యావత్ భారతీయ చిత్రసీమలోనే ఓ అపురూపం అనదగ్గ చిత్రం ‘ఆదిత్య 369’. మన దేశంలో తొలి టైమ్ మిషన్ మూవీగా ‘ఆదిత్య 369’ తెరకెక్కింది. ‘బ్యాక్ టు ది ఫ్యూచర్’ అనే చిత్రం స్ఫూర్తితో ఈ సినిమా రూపొందినా, ఎక్కడా ఆ సినిమాను కాపీ కొట్టింది లేదు.…
నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యలపై నటుడు నాగబాబు స్పందించాడు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) కోసం ఇప్పటివరకూ సేకరించిన విరాళాలు ఏమయ్యాయో అంటూ బాలకృష్ణ ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు ‘మా’ శాశ్వత భవనం లేదంటూ బాలయ్య ఇటీవలే వ్యాఖ్యలు చేశారు.ఈ వ్యాఖ్యలపై నాగబాబు స్పందిస్తూ.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సేకరించిన విరాళాలు కేవలం సంక్షేమం కోసమేనని, భవనం నిర్మించడానికి సేకరించలేదని తెలిపారు. ‘మా’ ఎన్నికల్లో ఇప్పుడు అందరూ శాశ్వత భవనం గురించే మాట్లాడుతున్నారు.. ‘మా’కు శాశ్వత భవనం…
“మా” కాంట్రవర్సీ రోజురోజుకూ ముదురుతోంది. ఈసారి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలలో 5 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అయ్యారు. అయితే ఈ విషయానికి సంబంధించి అభ్యర్థులు ఒకరిపై ఒకరు చేసుకున్న కామెంట్స్, స్టార్ హీరోలు ఎవరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అనే విషయాలు చర్చనీయాంశంగా మారాయి. నిన్న ‘మా’ ఎలక్షన్స్ పై మొదటిసారిగా స్పందించిన నందమూరి బాలకృష్ణ ఇండస్ట్రీ సమస్యలను బహిరంగంగా చర్చించడం సరికాదని హితవు పలికారు. అలాగే లోకల్, నాన్ లోకల్…
‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికలకు ఇంకా సమయం వున్నా.. ఇప్పటినుంచే రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఇదివరకు ఎన్నికల్లో స్పందించని నటీనటులు సైతం ఈసారి దూకుడు పెంచారు. అయితే.. తాజాగా ఈ ఎన్నికలపై నందమూరి బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మా’ ఎన్నికల విషయంలో లోకల్, నాన్ లోకల్ అనే అంశాన్ని పట్టించుకోననని తెలిపారు. మనది గ్లామర్ ఇండస్ట్రీ.. మన సమస్యల్ని బహిరంగంగా చర్చించడం సరికాదన్నారు. తెలంగాణ సర్కార్ తో రాసుకుపూసుకు తిరుగుతున్నారు, ‘మా’కు శాశ్వత…
నటసింహా నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కుతున్నమూడో చిత్రం ‘అఖండ’ మీద భారీ స్థాయిలో క్రేజ్ నెలకొంది. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ మీద మిర్యాల రవీందర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా దీనిని నిర్మిస్తున్నారు. ఇప్పటికే బాలకృష్ణను ‘అఖండ’ గా పరిచయం చేస్తూ వదిలిన టీజర్ కు సోషల్ మీడియాలో ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఆ టీజర్ లో బాలకృష్ణ నట విశ్వరూపానికి యూట్యూబ్లో రికార్డ్ స్థాయిలో వ్యూస్ వచ్చాయి. read also : ముద్దులు అయిపోయాయి!…
నందమూరి బాలకృష్ణ, ఎ. కోదండరామిరెడ్డి కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం ‘అనసూయమ్మగారి అల్లుడు’. ఈ సినిమా సాధించిన ఘన విజయం కారణంగా ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో 13 చిత్రాలు వచ్చాయి. విశేషం ఏమంటే నందమూరి బాలకృష్ణ తన కెరీర్ లో ఇంత వరకూ అత్యధిక చిత్రాలు చేసింది ఎ. కోదండరామి రెడ్డి దర్శకత్వంలోనే. 1986 జూలై 2న విడుదలైన ఈ సినిమా ఈ రోజుకు 35 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్ర…