నటసింహం నందమూరి బాలకృష్ణ అనారోగ్యం పాలైన తన అభిమానికి ఆసుపత్రిలో కన్పించి సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. సీనియర్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన అభిమానిని కలిసి ధైర్యం చెప్పారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలయ్య అభిమాని అఖిల భారత నందమూరి బాలకృష్ణ అభిమానుల సంఘం కన్వీనర్. ఈ విషయాన్ని బాలయ్య స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. “మా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న… ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న నా అభిమాని, అఖిల భారత నందమూరి బాలకృష్ణ అభిమానుల కన్వీనర్ నంబూరి సతీష్ గారిని సందర్శించాను. ఆయన త్వరగా కోలుకోవాలని దేవునికి మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. మీ నందమూరి బాలకృష్ణ” అంటూ అభిమాని శ్రేయస్సును కోరుకున్నారు. ఆయనకు ఒక చెట్టు ఇచ్చి త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు.
Read Also : చిరు ఇంట్లో సెలెబ్రిటీల సందడి… ఆమె కోసమే స్పెషల్ పార్టీ !
బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిలో గత కొన్నేళ్ల నుంచి ఎంతో మంది క్యాన్సర్ పేషెంట్లకు, పేద వారికి చికిత్స అందిస్తున్నారు. అన్న నందమూరి తారక రామారావు మొదటి భార్య బసవతారకం చిరస్మరణీయార్థం ఈ క్యాన్సర్ ఆస్పత్రిని నిర్మించారు. అప్పటి నుంచి ఆస్పత్రి బాధ్యతలను నందమూరి బాలకృష్ణ చూసుకుంటున్నారు.
మరోవైపు బాలయ్య సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో “అఖండ” అనే యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది అంటున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో మరో యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన నెక్స్ట్ మూవీకి ప్లాన్ చేశారు.
https://www.facebook.com/618961208156082/posts/4504415372943960/?sfnsn=wiwspmo