బాలయ్య నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇచ్చిన నిర్మాత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాని “టక్ జగదీష్” కరోనా పరిస్థితుల నేపథ్యంలో డైరెక్ట్ గా ఓటిటిలో విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలకు ముందు యువ నిర్మాత సాహు గారపాటి మీడియాతో మాట్లాడారు. ఈ చిత్రం సెప్టెంబర్ 10న వినాయక చవితి సందర్భంగా అమెజాన్ ప్రైమ్ ద్వారా డిజిటల్ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. అందులో భాగంగానే యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో నందమూరి బాలకృష్ణ చిత్రం గురించి ఈ యంగ్ ప్రొడ్యూసర్ క్లారిటీ ఇచ్చేశారు.
Read Also : టైగర్, మహేష్ కలిసి నటిస్తే… వీడియో వైరల్
Also Read
- బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
- Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో సుకుమార్ సినిమా లేనట్టేనా? అసలు కథ ఇదేనా!
- Kannada Beauties : టాలీవుడ్ అంతా కన్నడ భామల వెనుకే!
- The Paradise: నాని అతిపెద్ద రిస్క్.. 'ది పారడైజ్' బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా? ట్రేడ్ లెక్కలు ఇవే!
వచ్చే ఏడాది ఈ ప్రాజెక్ట్ షూట్ ప్రారంభమవుతుందని, ఈ సంవత్సరం దసరాకు ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన వస్తుందని ఆయన చెప్పారు. ఇప్పటికే ప్రాజెక్ట్ ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, అనిల్ “ఎఫ్9” షూటింగ్ పూర్తి చేసిన తర్వాత ఈ సినిమాపై దృష్టి పెడతాడని గారపాటి తెలిపారు. బాలకృష్ణ “అఖండ” చిత్రీకరణ పూర్తి చేసారు. ఆయన అక్టోబర్ నుండి గోపీచంద్ మలినేని సినిమా షూటింగ్ ప్రారంభిస్తాడు. ఇంకా పేరు పెట్టని ఈ మాస్ ఎంటర్‌టైనర్‌కు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. నాగ చైతన్యతో షైన్ స్క్రీన్స్ ఒక చిత్రాన్ని నిర్మిస్తుందని సాహు ధృవీకరించారు.
ఇక “టక్ జగదీష్” గురించి మాట్లాడుతూ “ఫ్యామిలీ, యూత్ ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా మేము “టక్ జగదీష్”ను రూపొందించాము. విదేశీ మార్కెట్ పూర్తిగా క్లోజ్ అయ్యింది. ఇప్పుడు ఇండియాలో కూడా అనుకూలమైన పరిస్థితులు లేవు. సినిమాను ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంచడానికి, సురక్షితంగా విడుదల చేయడానికి, మేము “టక్ జగదీష్”ను అమెజాన్ ప్రైమ్ ద్వారా రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నాము” అని అన్నారు. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాని, జగపతి బాబు, రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!