“అఖండ” రిలీజ్ డేట్ ఫిక్స్… యంగ్ హీరోకు షాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా సెకండ్ వేవ్ తరువాత పెద్ద సినిమాలన్నీ వరుసగా విడుదలకు సిద్ధమయ్యాయి. ఈ మేరకు రిలీజ్ డేట్లను కూడా ప్రకటించాయి. అయితే సీనియర్ హీరోల చిత్రాలైన ఆచార్య, అఖండ మాత్రం ఇంకా విడుదల తేదీలను ఖరారు చేయలేదు. అయితే తాజాగా జరుగుతున్న ప్రచారం ప్రకారం “అఖండ” అక్టోబర్ 13న విడుదలకు సిద్ధమవుతోందని తెలుస్తోంది. “ఆర్ఆర్ఆర్” ఇప్పటికే ఈ డేట్ ను లాక్ చేసినప్పటికీ ఆ సినిమా వాయిదా పడే అవకాశం ఉంది. కాబట్టి బాలయ్య అదే రోజున రావడానికి సిద్ధమయ్యాడని టాక్. మరోవైపు చిరంజీవి “ఆచార్య”తో అక్టోబర్ 13న రాబోతున్నాడనే వార్తలు కూడా వచ్చాయి. కానీ చిరు, కొరటాల తమ సినిమా రిలీజ్ కోసం మరింత సమయం తీసుకోనున్నారట. ఇప్పుడు క్రిస్మస్‌ను మంచి సీజన్‌గా భావిస్తున్నారు. అందులో బాలయ్య, బోయపాటి దసరా కానుకగా “అఖండ”ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. నిజానికి విజయదశమి “అఖండ”కు కలిసొచ్చే అంశమే. త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
Read Also : 50 ఏళ్ళ ‘మోసగాళ్ళకు మోసగాడు’
Also Read
- Anandi: ఇక్కడ రాజకీయాలు, లెక్కలు ఎక్కువ.. హీరోయిన్ ఆనంది సంచలన వ్యాఖ్యలు!
- Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్... హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
అయితే “అఖండ” రిలీజ్ విషయం మరో యంగ్ హీరోకు షాక్ అని చెప్పొచ్చు. అక్కినేని అఖిల్ సినిమాను “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్”ను అంతకు ఒకరోజు ముందుగా అంటే అక్టోబర్ 12న విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ఒకరోజు గ్యాప్ లో అఖిల బాలయ్యతో పోటీ పడడం ఆలోచించాల్సిన విషయం అంటున్నారు. అఖిల్ కు కెరీర్ మొదటి నుంచి ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ కూడా పడలేదు. దాని కోసమే తపన పడుతున్నాడు. అందుకే వరుస సినిమాలను లైన్లో పెట్టి హిట్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. “అఖండ” టీజర్ సోషల్ మీడియాలో సునామి సృష్టించింది. “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్”పై అంచనాలు బాగానే ఉన్నాయి. మరి ఇలాంటి సమయంలో అఖిల్ తన సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటాడో చూడాలి.
తాజావార్తలు
-
Germany: జర్మనీలో ముగ్గురు భారతీయులు అనుమానాస్పద మృతి.. రొమేనియా జాతీయుడు అరెస్ట్
-
AP Local Body Elections 2026: స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపివేయాలని హైకోర్టులో పిల్!
-
Sugar Stock Limits: చక్కెర నిల్వలపై కేంద్రం కొత్త నిబంధనలు.. నేటి నుంచే అమలు..
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే మృతి కేసులో బిగ్ ట్విస్ట్!
-
Anandi: ఇక్కడ రాజకీయాలు, లెక్కలు ఎక్కువ.. హీరోయిన్ ఆనంది సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..