అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటి దగ్గర మంగళవారం మధ్యాహ్నం ఉద్రిక్తత నెలకొంది. డంపింగ్ యార్డు వివాదం ఈ ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో టీడీపీ నేతలు, వైసీపీ నేతల మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం చోటుచేసుకుంది. డంపింగ్ యార్డుపై టీడీపీ నేతలు సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్టుకు స్పందించిన వైసీపీ కార్యకర్తలు బాలయ్య ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. అయితే వారిని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఒకరినొకరు తోసుకున్నారు.…