Bajrangdal protest: కర్ణాటకలో మొదలైన కాంగ్రెస్ మేనిఫెస్టో సెగ తెలంగాణను తాకింది. బజరంగ్‌దళ్‌పై నిషేధం విధిస్తామన్న కాంగ్రెస్ హామీపై కర్ణాటకలో బీజేపీ ఇప్పటికే వివాదంలో ఉంది. అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభల్లో నినాదాలు చేశారు.
DK Shivakumar: ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరికి ఆసక్తి కర్ణాటక ఎన్నికలపై నెలకొన్నాయి. కాంగ్రెస్ పతనావస్థకు అడ్డుకట్ట పడాలంటే.. కర్ణాటకలో ఖచ్చితంగా గెలిచితీరాలి. ఇక 2024లో మరోసారి కేంద్రంలో అధికారంలోకి రావాలంటే బీజేపీకి కర్ణాటక ఎన్నికలు చాలా కీలకం. మోదీ మానియా ఇంకా తిరుగులేదని బీజేపీ భావిస్తున్న తరుణంలో ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. నిన్న మొన్నటి వరకు కర్ణాటక ఎన్నికలంతా అభివృద్ధి వైపు సాగితే.. ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ‘భజరంగబలి’ జపం చేస్తున్నారు. ఇప్పుడు రాజకీయం…
Bajrang Dal: కర్ణాటక రాష్ట్రంలో అధికారంలో వస్తే హిందూ సంస్థ ‘భజరంగ్ దళ్’ను బ్యాన్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ తన మానిఫెస్టోలో ప్రకటించడం ఇప్పడు చర్చనీయాంశంగా మారింది. ఈ హామీపై బీజేపీతొో పాటు పలు హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఇండియా(పీఎఫ్ఐ)తో భజరంగ్ దళ్ ను పోలుస్తూ కాంగ్రెస్ ఈ హామీ ఇవ్వడంపై భజరంగ్ దళ్ మాతృసంస్థ విశ్వహిందూ పరిషత్(వీహెచ్ పీ) తీవ్రంగా స్పందించింది. కాంగ్రెస్ ఎన్నికల వాగ్ధానాన్ని సవాల్ గా…
ప్రేమికుల రోజు అంటూనే భజరంగ్ దళ్ రంగంలోకి దిగాల్సిందే. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజూ కాదంటూ.. వాలెంటైన్స్ డే పేరుతో ఈవెంట్లు, ప్రోగ్రామ్స్ చేస్తే వాళ్లను అడ్డుకుంటామని ప్రకటించారు. ప్రేమికుల రోజును బ్యాండ్ చేయాలని హైదరాబాద్ లోని ఎల్బీనగర్ లో ఫ్లాకాడ్స్ తో భజరంగ్ దళ్ నిరసన వ్యక్తం చేశారు.
Boycott on Muslim traders in Karnataka temple fair: కర్ణాటకలో మరో వివాదం రాజుకుంది. దేవాదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలోని శ్రీ మహాలింగేశ్వర ఆలయ ప్రాంగణంలో హిందువులు మాత్రమే వ్యాపారం చేయాలని విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) మరో వర్గం వారికి వార్నింగ్ ఇస్తోంది. దీనికి సంబంధించి ఆలయ పరిసరాల్లో ఓ పోస్టర్ కూడా ఏర్పాటు చేసింది. హిందూ మతం, సంప్రదాయాలపై విశ్వాసం ఉన్న హిందూ వ్యాపారులు మాత్రమే వాణిజ్యం నిర్వహించడానికి అవకాశం ఉంటుందని బ్యానర్ లో పేర్కొన్నారు.
Bajrang Dal Activist Killed in Assam: అస్సాం కరీంగంజ్ లో హిందూ సంస్థ భజరంగ్ ధళ్ కార్యకర్త హత్య ఉద్రిక్తతలను పెంచుతోంది. 16 ఏళ్ల భజరంగ్ దళ్ కార్యకర్తను అనిముల్ హక్ కత్తితో పొడిచి హత్య చేశాడు. ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. కరీంగంజ్ పట్టణానికి 50 కిలోమీటర్ల దూరంలో లోవైర్ పోవాలో శుంభు కోయిరి అనే యువకుడిని అనిముల్ హక్ కొత్తితో పొడిచి చంపాడు. నిందితుడు అనిముల్ హక్ ను పోలీసులు అరెస్ట్…
Bajrang Dal wants ban on New Year parties in Mangaluru: హిందూ సంస్థ భజరంగ్ దళ్ న్యూఇయర్ పార్టీలపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తుంది. కర్ణాటక రాష్ట్రం మంగళూర్ నగరంలో న్యూ ఇయర్ పార్టీలను బ్యాన్ చేయాలని కోరుతోంది. ఇందు కోసం భజరంగ్ దళ్ మంగళూర్ పోలీస్ కమిషనర్కు ఒక మొమోరాండం కూడా సమర్పించింది. ముస్లిం యువకులు ‘‘ లవ్ జిహాద్’’ కోసం బార్లు, పబ్బులను ఉపయోగించుకుంటున్నారని ఆరోపించింది. దీంతో మంగళూర్ వ్యాప్తంగా న్యూఇయర్…
Bajrang Dal men heckle inter-faith couple: కర్ణాటకలో ఇటీవల కాలంలో మతపరంగా సున్నిత అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఆ రాష్ట్రంలో ‘హిజాబ్’ వివాదం, హలాల్ వివాదాలు గతంలో జరిగాయి. తాజాగా బస్సులో ప్రయాణిస్తున్న మతాంతర జంటపై హిందూ సంస్థ భజరంగ్ దళ్ దాడి చేసింది. హిందు యువతి, ముస్లిం యువకుడు ఇద్దరు వివాహం చేసుకున్నారు. అయితే వీరిద్దరు దక్షిణ కన్నడ జిల్లాలో ఓ బస్సులో ప్రయాణిస్తున్న క్రమంలో భజరంగ్ దళ్ కార్యకర్తలు ఈ జంటపై…