నేటి సమాజంలో డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. ఈజీమని కోసం దారుణాలకు ఒడిగడుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని అడ్డదార్లు తొక్కుతున్నారు. దొంగతనాలు, దోపిడీలే కాదు పసిపిల్లలను అపహరించి అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి వెలుగుచూసింది. పసి పిల్లలను అమ్ముతున్న ముఠాను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు.10 మంది పసికందులను రక్షించారు. Also Read:Exclusive : పూరి జగన్నాథ్ – సేతుపతి సినిమా నుండి పూరి కనెక్ట్స్ ఔట్ ముఠా సభ్యులు గుజరాత్,…
హైదరాబాద్ శివారులో పసి పిల్లల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. మేడిపల్లి కేంద్రంగా పసి పిల్లల అమ్మకాలు కొనసాగిస్తున్నారు. ఓ ఆర్ఎంపీ డాక్టర్ ఇతర రాష్ట్రాల నుంచి పిల్లల్ని తెచ్చి పిల్లలు లేని తల్లిదండ్రులకు అమ్ముతున్నాడు. ఒక్కో పిల్లాడిని రూ. 5 లక్షల వరకు అమ్ముతుంది ఈ ముఠా. ఈ విషయం తెలుసుకున్న బాలల హక్కుల సంఘం ఈ విషయాన్ని గుట్టురట్టు చేసింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. దీంతో.. పోలీసులు అక్కడికి చేరుకుని ముఠాను అరెస్ట్ చేశారు.…
ఇటలీలో పడిపోతున్న జనాభాపూ పోప్ ఫ్రాన్సిస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటాలియన్లు ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉండాలని కోరారు. దేశ జనాభా సంక్షోభం భవిష్యత్తుకు ముప్పు అని ఆయన హెచ్చరించారు. కుటుంబాలకు సహాయం చేయడానికి దీర్ఘకాలిక విధానాలకు పోప్ పిలుపునిచ్చారు. ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ పిల్లలు, యువత లేని దేశానికి భవిష్యత్తు లేదన్నారు. ఇటలీలో జననాల రేటు ఇప్పటికే చాలా తక్కువగా ఉందని.. 15 సంవత్సరాలుగా నిరంతరం పడిపోతోందని…
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగిన పరిశోధనలో గర్భిణుల పాలలో పురుగుమందులు ఉన్నట్లు తేలింది. లక్నోలోని కేజీఎంయూలోని స్త్రీలు, శిశుజనన ఆసుపత్రి వైద్యులు ఈ పరిశోధన చేశారు. మేరీ క్వీన్స్ ఆసుపత్రిలో చేరిన 130 మంది శాకాహార, మాంసాహార గర్భిణులపై ఓ అధ్యయనం నిర్వహించి మాంసాహారం, శాకాహారం తీసుకునే గర్భిణుల తల్లిపాలలో క్రిమిసంహారక మందులు ఉన్నాయా అనేది పరిశీలించారు.
వీధి కుక్కల దాడులు క్రమంగా పెరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వీధి కుక్కల దాడిలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కుక్కల దాడిలో చిన్నారులు మృతి చెందిన సంఘటనలు కూడా ఉన్నాయి.