ఇటలీలో పడిపోతున్న జనాభాపూ పోప్ ఫ్రాన్సిస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటాలియన్లు ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉండాలని కోరారు. దేశ జనాభా సంక్షోభం భవిష్యత్తుకు ముప్పు అని ఆయన హెచ్చరించారు. కుటుంబాలకు సహాయం చేయడానికి దీర్ఘకాలిక విధానాలకు పోప్ పిలుపునిచ్చారు. ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ పిల్లలు, యువత లేని దేశానికి భవిష్యత్తు లేదన్నారు. ఇటలీలో జననాల రేటు ఇప్పటికే చాలా తక్కువగా ఉందని.. 15 సంవత్సరాలుగా నిరంతరం పడిపోతోందని పేర్కొన్నారు. గతేడాది కనిష్ట స్థాయికి చేరుకుందని తెలిపారు.
Chhattisgarh: బీజాపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 8 మంది మావోయిస్టులు మృతి..
గత ఏడాది దేశంలో 3,79,000 మంది శిశువులు జన్మించారు. ఇటాలియన్ ప్రధాన మంత్రి జార్జియా మెలోని ప్రభుత్వం.. వాటికన్ నుండి బలమైన మద్దతుతో 2033 నాటికి సంవత్సరానికి కనీసం 500,000 మంది శిశువుల జననాలను ప్రోత్సహించే ప్రచారాన్ని ప్రారంభించింది. ఇటలీ వృద్ధాప్య జనాభా భారం కింద ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా నిరోధించడానికి ఈ రేటు అవసరమని జనాభా నిపుణులు అంటున్నారు.
Varun Sandesh: డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతున్న వరుణ్ సందేశ్.. ‘నింద’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల..
ఈ సందర్భంగా పోప్ మాట్లాడుతూ.. ఫ్రాన్సిస్ రాబోయే 2025 పవిత్ర సంవత్సరంలో తన డెమోగ్రాఫిక్ కాల్‌ను నొక్కి చెప్పడం కొనసాగించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం అత్యధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్న పెట్టుబడులు.. ఆయుధ కర్మాగారాలు, గర్భనిరోధకాలు అని అన్నారు. ఒకటి జీవితాన్ని నాశనం చేస్తుంది.. మరొకటి జీవితాన్ని నిరోధిస్తుందని పేర్కొన్నారు.