Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిరంలో ఆశ్చర్యకరమైన ఘటన ఎదురైంది. కొత్తగా ప్రారంభమయైన మందిరంలోకి కోతి ప్రవేశించింది. గర్భగుడిలోని రామ్ లల్లా విగ్రహం వరకు వెళ్లింది. ఈ విషయాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఎక్స్(ట్విట్టర్)లో ప్రకటించింది. మంగళవారం సాయంత్రం 5:50 గంటల ప్రాంతంలో ఒక కోతి దక్షిణ ద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించింది.
రాంలాల దర్శనం కోసం రామాలయం వెలుపల భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని దర్శన సమయాన్ని కూడా పొడిగించారు. ఇకపై భక్తులు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు రాంలాలా దర్శనం చేసుకునేందుకు అవకాశం కల్పించింది.
Secunderabad to Ayodhya Trains and Timings: దేశం మొత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ మహోత్తర ఘట్టం పూర్తయింది. శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ సోమవారం అట్టహాసంగా సాగింది. ఈ అద్భుత క్షణాలను కళ్లారా వీక్షించేందుకు.. దేశవ్యాప్తంగా రాజకీయ, సినీ, క్రీడాకారులతో పాటు రామ భక్తులు పెద్ద ఎత్తున అయోధ్యకు వెళ్లారు. ఇక మంగళవారం (జనవరి 23) నుంచి సాధారణ భక్తులకు కూడా రామ్‌లల్లా దర్శనం ఇవ్వనున్నాడు. దాంతో రామ…
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం రాంలాలా పవిత్రోత్సవానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. తాజాగా.. ప్రధాని మోదీ ఆ లేఖకు కృతజ్ఞతలు తెలిపారు. అయోధ్యను నా గుండెల్లో పెట్టుకొని ఢిల్లీకి తిరిగి వచ్చాను.. తన జీవితంలో మరచిపోలేని క్షణాలను చూసి అయోధ్య నుంచి తిరిగి వచ్చిన తర్వాత మీకు ఈ లేఖ రాస్తున్నానని ప్రధాని మోడీ తెలిపారు. మీరు రాసిన లేఖ అందే సమయానికి నా మనసు భావోద్వేగంతో నిండిఉంది.. దాని నుంచి బయటపడేందుకు…
బాలరాముడి ప్రాణప్రతిష్ట జరిగిన మరుసటి రోజే అయోధ్యకు భారీగా భక్తులు పోటెత్తారు. అయితే మంగళవారం నుంచి సామాన్య భక్తులకు అనుమతిస్తుండటంతో లక్షలాది భక్తులు అయోధ్యకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో అయోధ్య మొత్తం కిక్కిరిసిపోయింది. కాగా.. ఈరోజు రెండున్నర నుండి మూడు లక్షల మంది భక్తులు రాముడిని దర్శించుకున్నట్లు ఆలయ ట్రస్ట్ అంచనా వేస్తోంది. అంతేకాకుండా.. రాముడిని దర్శించుకునే భక్తులు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు.
అయోధ్యలోని రామమందిరంలో కొలువుదీరిన బాలరాముడు ఇకపై 'బాలక్ రామ్' గా దర్శనమివ్వనున్నారు. ఈ మేరకు ట్రస్ట్ పూజారి అరుణ్ దీక్షిత్ తెలిపారు. మందిరంలో కొలువుదీరిన రామ్ లల్లా ఐదేళ్ల పసిబాలుడిగా దర్శనమిస్తున్నారు. అందుకే బాలక్ రామ్ పేరును నిర్ణయించినట్లు చెప్పారు. అంతేకాకుండా.. ఆలయాన్ని బాలక్ రామ్ మందిర్ గా పిలుస్తామని తెలిపారు.
అయోధ్యలో ఎన్నో శతాబ్దాల పోరాటం.. నిరీక్షణ తర్వాత రామ్ లల్లా విగ్రహం సోమవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో ప్రతిష్టించబడింది. కాగా.. అంతకుముందు రామ్ లల్లా విగ్రహాన్ని తయారు చేసే పనిని ముగ్గురు శిల్పులకు అప్పగించింది ఆలయ ట్రస్ట్. అయితే రామమందిరంలో ప్రతిష్టబోయే ముందు రెండు విగ్రహాలను ఎంపిక చేశారు. చివరకు మైసూర్‌కు చెందిన అరుణ్ యోగిరాజ్ తయారు చేసిన విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్టించారు. అయితే ఎంపిక కానటువంటి రాంలల్లా విగ్రహం ఆలయంలో ప్రతిష్టించలేకపోయినప్పటికీ, ఆలయ…
అయోధ్య రామ మందిరంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట రోజు (సోమవారం) ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో కీలక నిర్ణయం తీసుకుంది. నిన్న ( జనవరి 22న) పలు ఉత్తరాది రాష్ట్రాల్లో నాన్వెజ్ డెలివరీలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రకటించింది.
రాంలాలా ప్రాణప్రతిష్ట సందర్భంగా బుర్జ్ ఖలీఫాపై రాముడి ప్రతిరూపాన్ని ప్రదర్శించే ఫోటో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది. అయితే, ఇంతకీ ఈ చిత్రం నిజమా? లేక ఎడిట్ చేసిన ఫోటో వైరల్ అవుతుందా? అనేది తెలియాల్సి ఉంది.
Ram Mandir : మీరు కూడా అయోధ్యను సందర్శించాలనుకుంటున్నరా... అయితే తప్పకుండా ఈ వార్త మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రాములోరి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సోమవారం అత్యంత వైభవంగా జరిగింది.