శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవంకు మరి కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి. జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12.29 గంటలకు శుభ ముహూర్తంలో రాముడి విగ్రహ ప్రతిష్ఠాపణ కార్యక్రమం జరగనుంది. శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపణకు వారం రోజుల ముందే.. ఆచార వ్యవహారాలు ప్రారంభం కానున్నాయి. జనవరి 16 నుంచి 22 వరకు మహామస్తకా అభిషేక కార్యక్రమాలు కొనసాగుతాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను రామజన్మభూమి తీర్థ క్షేత్ర…
ఇవాళ్టి నుంచి అయోధ్యలో రామోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి. మార్చి 24 వరకు జరిగే ఈ రామోత్సవాలలో మన దేశానికి చెందిన కళాకారులతో పాటు ప్రపంచం నలుమూల నుంచి వచ్చే 35 వేలకు పైగా కళాకారులు పాల్గొనబోతున్నారు. నేటి నుంచి రామ కథా పార్కులో రామకథ స్టార్ట్ అవుతుంది.
పాఠశాలకు దారి వెలుగుకు మార్గం.. సావిత్రి బాయి ఫూలే దేశంలోని స్త్రీలు, షెడ్యూల్డ్ కులాలలో విద్యా జ్యోతిని మేల్కొల్పారు అని వ్యాఖ్యనించారు. వారి వల్లనే మన సమాజంలో షెడ్యూల్డ్ కులాలకు చోటు దక్కింది అంటూ చంద్రశేఖర్ చెప్పుకొచ్చారు.
Ram Mandir: రామ మందిర ప్రారంభోత్సవానికి మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. జనవరి 22న అయోధ్యలోని రామాలయ ప్రారంభోత్సవ వేడుక కోసం దేశం మొత్తం సిద్ధమవుతోంది. ప్రధాని నరేంద్రమోడీతో పాటు దేశవ్యాప్తంగా పలువురు ముఖ్య అతిథులతో పాటు సాధువులు మొత్తం 7000 మంది ఈ కార్యక్రమానికి హాజరుకాబోతున్నారు. మరోవైపు కోట్లాది మంది ప్రజలు పరోక్షంగా వీక్షించనున్నారు.
Ram Mandir Inauguration: అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్ట పవిత్రోత్సవానికి సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. అందరూ శ్రీరాముని కార్యంలో నిమగ్నమై ఉన్నారు. జనవరి 22న రామాలయంలో రామ్‌లాలా ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది.
Ram Mandir: అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. దేశవ్యాప్తంగా కన్నుల పండగగా సాగే ఈ మహత్తర ఘట్టం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. జనవరి 22న భవ్య రామమందిరంలో రామ్ లల్లా విగ్రహం ప్రతిష్టాపన జరగబోతోంది. ఇప్పటికే దేశవ్యాప్తగా 7000 మంది అతిథులను ఆలయ ట్రస్ట్ ఆహ్వానించింది. ప్రధాని నరేంద్రమోడీతో పాటు పలు రాష్ట్రాల సీఎంలు, కీలక రాజకీయ నాయకులు, ఫిలిం స్టార్లు, స్పోర్ట్స్ స్టార్స్‌లతో పాటు సాధువులు ఈ…
Ram Temple: దేశవ్యాప్తంగా అంతా రామమందిర ప్రారంభోత్సవంపైనే చర్చ నడుస్తోంది. హిందువులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న అయోధ్య భవ్య రామమందిరంలో శ్రీరామ విగ్రహ ప్రతిష్టాపన ఈ నెల 22న జరగబోతోంది. ముఖ్యంగా ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే వేడుకలు ప్రారంభమయ్యాయి.
Badruddin Ajmal: తరుచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఉండే ఏఐయూడీఎఫ్ చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్ మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. ఈ నెల 22న అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం ఉన్న నేపథ్యంలో దీన్ని ఉద్దేశిస్తూ.. ముస్లింలు జనవరి 20 నుంచి 26 వరకు ఇళ్లల్లోనే ఉండాంటూ పిలుపునిచ్చారు. రామమందిర ప్రతిష్టాపన సమయంలో రైళ్లలో ప్రయాణించకూడదని కోరారు. ముస్లింలకు బీజేపీ శత్రువు అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.
Ram Mandir: అయోధ్యంలో శ్రీరామ మందిర ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా సాధువులతో సహా 7000 మంది అతిథులకు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానాలు పంపింది. ఇదిలా ఉంటే రామజన్మభూమి-బాబ్రీ మసీదులో వివాదంలో మాజీ న్యాయవాదిగా ఉన్న ఇక్బాల్ అన్సారీని జనవరి 22న జరగబోయే కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా ఆలయ ట్రస్ట్ ఆహ్వానాన్ని అందించింది.
రాముడి విగ్రహాన్ని గర్భగుడిలో ప్రాణ ప్రతిష్టాపన చేసే కార్యక్రమం కోసం ప్రపంచం మొత్తం వేచి ఉంది. దీంతో అయోధ్యకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు, పర్యాటకులతో రైల్వే స్టేషన్, విమానాశ్రయంతో పాటు బస్టాండ్ నుంచి రామ మందిరానికి చేరుకుంటున్నారు.