రామ మందిరం ప్రారంభోత్సవానికి అయోధ్య భక్తులందరికి పిలుపునిస్తోంది. జనవరి 22న దేశ నలుమూలల నుంచి భక్తులు అయోధ్యకు భారీ సంఖ్యలో తరలిరానున్నారు. ఈ మేరకు యూపీ ప్రభుత్వం కూడా భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ నుంచి రాష్ట్రాల సీఎంలకు, ప్రముఖ రాజకీయ నేతలకు ఆహ్వానం అందింది. ఇక తమిళనాడు నుంచి రాముని గుడి గంటలు కూడా బయలుదేరాయి. పలువురు భక్తులు రామయ్యకు కానుకలు సమర్పిస్తూ భక్తిని చాటుకుంటున్నార. మరోవైపు భక్తులు అయోధ్యకు…
Ram Mandir : రామనగరి అయోధ్యలో శ్రీరాముని ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జనవరి 22, 2024 లోపు అవసరమైన పనిని పూర్తి చేయడానికి వందలాది మంది కార్మికులు పగలు, రాత్రి పనిచేస్తున్నారు.
అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవానికి ముందు రైల్వే శాఖ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. పవిత్ర నగరమైన అయోధ్య జంక్షన్‌లోని రైల్వే స్టేషన్ పేరును మార్చేసింది. అయోధ్యలో కొత్తగా నిర్మించిన ఈ రైల్వే స్టేషన్‌కు ‘అయోధ్య ధామ్ జంక్షన్’గా నామా కరణం చేసింది.
BJP: వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం బీజేపీ సిద్ధమవుతోంది. మూడోసారి వరసగా అధికారంలోకి వచ్చేందుకు కసరత్తు ప్రారంభించింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 50 శాతం ఓట్లను పొందడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే తన పార్టీ కార్యకర్తలకు, నేతలకు దిశానిర్దేశం చేసింది. జనవరి 22, 2024లో అయోధ్యంలో భవ్య రామమందిర ప్రారంభోత్సవం జరగబోతోంది. మోడీ హయాంలో ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్ నెరవేరబోతోంది. అయితే అయోధ్య రామమందిర ప్రతిష్టాపనను సద్వినియోగం చేసుకోవాలని పార్టీ, కార్యకర్తలను కోరింది.
Ram Mandir: సుదీర్ఘ పోరాటం తర్వాత ఎట్టకేలకు ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో 22 జనవరి 2024న రామమందిరాన్ని ప్రతిష్ఠించబోతున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోడీ హాజరుకానున్నారు.
Chiranjeevi Invited for Ayodhya Ram Mandir Opening Ceremony from tollywood: అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ వేడుక కోసం టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం అందింది. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామ్ మందిర్ ప్రారంభోత్సవం 2024 జనవరి 22న జరుగనుంది. అన్ని వర్గాల, రంగాల నుంచి ప్రముఖులను ఈ వేడుకకు ఆహ్వానించబడుతున్నారు. ఇక ఈ వేడుకకి భారతీయ చలనచిత్ర పరిశ్రమలోని ప్రముఖులకు కూడా ఆహ్వానం పంపబడింది. అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ వేడుకకు టాలీవుడ్ నుండి మెగాస్టార్…
Ayodhya Deepotsav: దీపావళి వేడుకల్లో భాగంగా అయోధ్యలో జరిగిన ‘దీపోత్సవం’ ప్రపంచ రికార్డును సృష్టించింది. ఒకేసారి 22 లక్షల దీపాలను వెలిగించారు. దీనిపై ప్రధాని నరేంద్రమోడీ స్పందించారు. ఆదివారం ఉత్తర్ప్రదేశ్ అయోధ్యలో జరిగిన దీపోత్సవాన్ని ‘అద్భుతమైనది, దైవికమైనది, మరుపురానిది’గా కొనియాడారు. ఈ వేడులకు సంబంధించిన చిత్రాలను పంచుకున్నారు.
Ayodhya Ram Mandir: మధ్యప్రదేశ్ ఎన్నికలకు కొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. ఇప్పటికే అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ విస్తృతంగా ప్రయత్నం చేస్తున్నాయి. మరోసారి అధికారం సాధించాలని బీజేపీ, గద్దె దించాలని కాంగ్రెస్ ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర పీసీసీ చీఫ్, మాజీ సీఎం కమల్నాథ్ రామమందిరంపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి కారణమువుతున్నాయి.
Kangana Ranaut: నటి కంగనా రనౌత్ రాజకీయాలకు చాలా దగ్గరగా ఉంటారు. ముఖ్యంగా బీజేపీకి ఫెవర్గా వ్యవహరిస్తుంటారు. గతంలో మహారాష్ట్రలో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలో ఏకంగా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సంచలన వ్యాఖ్యలు చేయడం చూశాం. ప్రధాని మోడీతో పాటు బీజేపీ ప్రభుత్వాన్ని పొగుడుతూ ఉంటారు. ఇవన్నీ చూసినప్పుడు కంగనా ఏదో రోజు ప్రత్యక్ష రాజకీయాలకు వస్తుందనే వార్తలు వినిపిస్తూనే ఉంటాయి.