Ram Temple consecration: అయోధ్యలో జనవరి 22న భవ్య రామాలయ ప్రారంభోత్సవం జరగబోతోంది. ఈ వేడక కోసం దేశవ్యాప్తంగా రామ భక్తులు, హిందువులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే అయోధ్యలో పండగ వాతావరణం నెలకొంది. దేశవ్యాప్తంగా రామనామ స్మరణతో మారుమోగుతోంది. ఈ వేడుకకు ప్రధాని నరేంద్రమోడీతో పాటు 7000 మంది ప్రముఖులు హాజరవుతున్నారు. ఇప్పటికే యోగి ప్రభుత్వం అయోధ్యతో పాటు ఉత్తర్ ప్రదేశ్ అంతటా భద్రతను కట్టుదిట్టం చేసింది.
Ram Mandir inauguration: రామమందిర ప్రారంభోత్సవానికి మరికొన్ని రోజులు మాత్రమే గడువు ఉంది. జనవరి 22న అయోధ్య రామమందిరంలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన జరగబోతోంది. ఈ కార్యక్రమం కోసం దేశవ్యాప్తంగా భక్తులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే అయోధ్యతో పాటు ఉత్తర్ ప్రదేశ్ వ్యాప్తంగా పండగ వాతావారణం నెలకొంది.
Ram Mandir: అయోధ్యలో భవ్య రామమందిర వేడులకు ప్రారంభయ్యాయి. అయోధ్య, యూపీలతో పాటు దేశవ్యాప్తంగా రామ భక్తులు జనవరి 22 ఆలయ ప్రారంభోత్సవ అద్భుత ఘట్టం కోసం ఎదురుచూస్తున్నారు. దేశంలోని అన్ని ప్రాంతాలు రామనామ స్మరణతో మారుమోగుతున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా, దేశవ్యాప్తంగా 7000 మందికి పైగా ప్రముఖులు హాజరవుతున్న ఈ కార్యక్రమానికి యూపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసింది. రామ్ లల్లా ప్రాణప్రతిష్ట కోసం యావత్ దేశం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోంది.
ఉత్తరప్రదేశ్ కనెక్టివిటీ కోసం కొత్తగా ఐదు ఎయిర్ పోర్టులను ఏర్పాటు చేయబోతున్నట్లు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రకటించారు. దీంతో రాష్ట్రంలోని మొత్తం విమానాశ్రయాల సంఖ్య 19కి చేరుకుందని పేర్కొన్నారు.
లోక్‌సభ ఎన్నికలకు ముందు అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం ద్వారా బీజేపీ జిమ్మిక్కులకు పాల్పడుతోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం ఓ జిమ్మిక్ షో అని ఆమె వ్యాఖ్యానించారు.
అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం దృష్ట్యా రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు జనవరి 22న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సెలవు ప్రకటించారు. విద్యాసంస్థలకు సెలవు ప్రకటించడంతో పాటు ఆ రోజున రాష్ట్రవ్యాప్తంగా మద్యం అమ్మకాలు ఉండవని ముఖ్యమంత్రి తెలిపారు.
జార్ఖండ్కు చెందిన 85 ఏళ్ల వృద్ధురాలు తన మూడు దశాబ్దాల మౌనవ్రతాన్ని జనవరి 22న అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించడంతో విరమించనున్నారు. అయోధ్య రామమందిర నిర్మాణాన్ని ఆమె తన కలగా భావించింది. తన కల నెరవేరేవరకు మౌనవ్రతాన్ని పాటిస్తానని ఆమె ప్రతిజ్ఞ చేసింది.
శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవంకు మరి కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి. జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12.29 గంటలకు శుభ ముహూర్తంలో రాముడి విగ్రహ ప్రతిష్ఠాపణ కార్యక్రమం జరగనుంది. శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపణకు వారం రోజుల ముందే.. ఆచార వ్యవహారాలు ప్రారంభం కానున్నాయి. జనవరి 16 నుంచి 22 వరకు మహామస్తకా అభిషేక కార్యక్రమాలు కొనసాగుతాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్ను రామజన్మభూమి తీర్థ క్షేత్ర…
ఇవాళ్టి నుంచి అయోధ్యలో రామోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి. మార్చి 24 వరకు జరిగే ఈ రామోత్సవాలలో మన దేశానికి చెందిన కళాకారులతో పాటు ప్రపంచం నలుమూల నుంచి వచ్చే 35 వేలకు పైగా కళాకారులు పాల్గొనబోతున్నారు. నేటి నుంచి రామ కథా పార్కులో రామకథ స్టార్ట్ అవుతుంది.