Danish Kaneria celebrate Ram Mandir PranPratishtha ceremony: శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో రామ్‌లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా సాగిన ఈ మహా క్రతువుకు దేశ, విదేశాల నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా యావత్ భారతావని ‘జై శ్రీరాం’ నినాదాలతో ప్రతిధ్వనించింది. విదేశాల్లోనూ భారతీయులు ఘనంగా సంబరాలు చేసుకున్నారు. అంతేకాదు విదేశీ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న పలువురు భారత సంతతి ప్లేయర్స్…
Keshav Maharaj React on Ram Mandir PranPrathistha: శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ మరికొద్ది సేపట్లో జరగనుంది. అయోధ్య గర్భగుడిలో రామ్‌లల్లా కొలువుదీరబోతున్నాడు. మధ్యాహ్నం 12: 20 గంటలకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. దాంతో 500 ఏళ్ల నాటి హిందువుల కల నెరవేరనుంది. ప్రాణప్రతిష్ఠ మహోత్సవం కోసం యావత్ భారతదేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. రామమందిర ప్రాణప్రతిష్ఠ సందర్భంగా దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ కేశవ్ మహరాజ్ స్పందించాడు. భారత్‌కు ప్రత్యేక శుభాకాంక్షలను తెలిపాడు. ప్రాణప్రతిష్ఠ…
KS Bharat dedicated his century to Shree Ram: ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ముందు తెలుగు ఆటగాడు శ్రీకర్ భరత్ (116 నాటౌట్; 165 బంతుల్లో 15×4) సెంచరీ బాదాడు. ఇంగ్లండ్ లయన్స్‌తో తొలి అనధికార టెస్టులో భారత్-ఎ తరఫున భరత్ శతకం బాదాడు. నాలుగో రోజైన శనివారం సెంచరీ చేసిన అనంతరం భరత్ వినూత్నంగా సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. తన సెంచరీని శ్రీరాముడికి అంకితమిస్తూ.. రాముడు విల్లు ఎక్కుపెట్టి బాణాన్ని సంధించిన విధానాన్ని…
PM Modi Full Schedule For Ram Mandir Inauguration on 2024 January 22: శ్రీరాముడు జన్మించిన పుణ్యభూమి అయోధ్యలో రామయ్య ప్రాణప్రతిష్ఠ వేడుకకు ఇంకా ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది. సోమవారం మధ్యాహ్నం 12.05 గంటలకు బాలరామచంద్రుడి విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం జరగనుంది. ప్రపంచం నలుమూలల నుంచి తరలివస్తున్న భక్త జనం సాక్షిగా ఆగమ శాస్త్ర పద్ధతుల్లో బలరాముడికి ప్రతిష్ఠించనున్నారు. రామ మందిర శంకుస్థాపనలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం (జనవరి 22) అయోధ్యకు…
Ayodhya Ram Mandir Guest List: ఎన్నో వివాదాలు, మరెన్నో న్యాయ పోరాటాలను అధిగమించి శ్రీరాముడికి శాశ్వత నివాసాన్ని నిర్మించాలన్న ప్రయత్నం ఎట్టకేలకు నెరవేరబోతోంది. శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి మరికొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. దేశంలోని వివిధ రంగాలకు చెందిన దిగ్గజాలను సోమవారం అయోధ్యలో జరగనున్న ప్రాణప్రతిష్ఠ వేడుకకు ప్రత్యేక అతిథులుగా కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ కార్యక్రమానికి దాదాపు 8,000 మంది అతిథులు రానున్నారు. ఇందులో క్రీడా ప్రముఖులు కూడా ఉన్నారు. క్రికెట్…