KS Bharat dedicated his century to Shree Ram: ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ముందు తెలుగు ఆటగాడు శ్రీకర్ భరత్ (116 నాటౌట్; 165 బంతుల్లో 15×4) సెంచరీ బాదాడు. ఇంగ్లండ్ లయన్స్‌తో తొలి అనధికార టెస్టులో భారత్-ఎ తరఫున భరత్ శతకం బాదాడు. నాలుగో రోజైన శనివారం సెంచరీ చేసిన అనంతరం భరత్ వినూత్నంగా సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. తన సెంచరీని శ్రీరాముడికి అంకితమిస్తూ.. రాముడు విల్లు ఎక్కుపెట్టి బాణాన్ని సంధించిన విధానాన్ని అతడు అనుకరించాడు. ఇందుకు సంబందించిన వీడియో, ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయోధ్యలో నిర్మించిన భవ్య మందిరంలో మరికొన్ని గంటల్లో శ్రీరాముడు కొలువుదీరనున్నారు. బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠ సోమవారం మధ్యాహ్నం 12.30కు మొదలై ఒంటి గంటకు పూర్తవుతుంది.
కేఎస్ భరత్‌తో పాటు సాయి సుదర్శన్ (97), మానవ్ సుతార్ (89 నాటౌట్) రాణించడంతో ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగిన తొలి అనధికార టెస్టును భారత్-ఎ డ్రా చేసుకుంది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ లయన్స్ 8 వికెట్లు కోల్పోయి 553 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ జెన్నింగ్స్ (154), కెప్టెన్ జోష్ బోహన్నన్ (125) సెంచరీలు చేశారు. మనవ్ నాలుగు వికెట్లు తీశాడు. ఇండియా-ఏ తొలి ఇన్నింగ్స్‌లో 227 పరుగులకే ఆలౌటైంది. రజత్ పటిదార్ 158 బంతుల్లో 151 పరుగులు బాదాడు. మాథ్యూస్ పాట్స్, ఫిషర్ చెరో నాలుగు వికెట్లు తీశారు.
Also Read: Ram Mandir : ఫలించిన 500 ఏళ్ల నిరీక్షణ.. 10లక్షల దీపాలతో శ్రీరాములోరికి స్వాగతం
ఇంగ్లండ్ లయన్స్ 163/6 స్కోరు వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. జెన్నింగ్స్ (64), జేమ్స్ (56) హాఫ్ సెంచరీలు చేశారు. అనంతరం 489 పరుగుల భారీ లక్ష్యంతో ఛేదనకు దిగిన భారత్-ఏ 5 వికెట్లు కోల్పోయి 426 పరుగులు చేసి మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. 6 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును సుదర్శన్, సర్ఫరాజ్ ఖాన్ (55) ఆదుకున్నారు. సర్ఫరాజ్ ఔటైనా ప్రదోష్ (43)తో కలిసి సుదర్శన్ స్కోరుబోర్డు ముందుకు నడిపించాడు. సుదర్శన్ అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన భరత్.. మనవ్ (89)తో కలిసి ద్విశతక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అద్భుత పోరాటంతో ఓటమి కోరల్లో చిక్కుకున్న జట్టును గెలుపు దిశగా నడిపించాడు.