చూడగానే బాగా పరిచయం ఉన్న మనిషి అనిపిస్తాడు. అతనిలోని ప్రతిభ సైతం అదే తీరున ఆకట్టుకుంటూ ఉంటుంది. కేవలం నటనతోనే కాకుండా, దర్శకునిగా, రచయితగా తనదైన బాణీ పలికిస్తున్నారు శ్రీనివాస్ అవసరాల. ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘ఫలానా అబ్బాయి – ఫలానా అమ్మాయి’ తాజా చిత్రం ఇటీవలే విడుదలై అలరిస్తోంది. అందులో నటునిగానూ శ్రీనివాస్ ఆకట్టుకున్నారు. మునుముందు కూడా నటన, దర్శకత్వంతో అలరించే ప్రయత్నాల్లోనే శ్రీనివాస్ అవసరాల సాగుతున్నారు. శ్రీనివాస్ అవసరాల 1984 మార్చి 19న కాకినాడలో…