Australian Open 2025: వరల్డ్ నంబర్ వన్, డిఫెండింగ్ ఛాంపియన్ యానిక్ సినర్ (ఇటలీ) (Yannick Sinner) తన అద్భుత ప్రదర్శనతో ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 పురుషుల సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన తుది పోరులో అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) (Alexander Zverev)పై 6-3, 7-6(7-4), 6-3 తేడాతో విజయం సాధించి, వరుసగా రెండో ఏడాది ఈ ప్రతిష్ఠాత్మక టైటిల్‌ను దక్కించుకున్నాడు. ఈ విజయంతో సినర్ తన మూడో గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను తన…
Novak Djokovic: తన కెరీర్‌లో 25వ గ్రాండ్‌స్లామ్‌ను దక్కించుకోవాలని పట్టుదలతో ఉన్న సెర్బియా టెన్నిస్ స్టార్ జకోవిచ్‌ను గాయంతో తీవ్ర ఇబ్బంది పడ్డారు. దీంతో ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 సెమీస్‌లో అలెగ్జాండర్ జ్వెరెవ్‌పై మ్యాచ్‌లో బరిలోకి దిగి తొలి సెట్ తర్వాత రిటైర్డ్‌హర్ట్ ప్రకటించి బయటకు వెళ్లిపోయాడు.
టాప్ సీడ్, డిఫెండింగ్ ఛాంపియన్ యానిక్ సినర్ (ఇటలీ) ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. నాలుగో రౌండ్లో 6-3, 3-6, 6-2, 6-2తో 13వ సీడ్ రూన్ (డెన్మార్క్)పై గెలుపొందాడు. యువ ఆటగాళ్లు ఇద్దరు హోరాహోరీగా తలపడ్డారు. మూడో సెట్లో ఓ ర్యాలీ 37 షాట్ల పాటు సాగిందంటే అర్ధం చేసుకోవచ్చు. వేడి, ఉక్కపోత పరిస్థితుల మధ్య గాయంతో ఇబ్బందిపడుతూనే సినర్ మ్యాచ్ నెగ్గాడు. ఇక క్వార్టర్స్‌లో ఎనిమిదో సీడ్ డిమినార్ (ఆస్ట్రేలియా)ను టైటిల్…
25వ టైటిల్‌తో చరిత్ర సృష్టించే దిశగా టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్ (సెర్బియా) సాగిపోతున్నాడు. గతేడాది ఒక్క గ్రాండ్‌స్లామ్ కూడా గెలవని జకో.. తన అడ్డా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో జోరు సాగిస్తున్నాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో జకోవిచ్ 6-1, 6-4, 6-4తో మచాక్ (చెక్ రిపబ్లిక్)పై గెలిచాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఒక్కో సెట్ కోల్పోయిన జకో.. ఈ మ్యాచ్‌లో మాత్రం పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. రెండో సెట్ ఆరంభంలో శ్వాస తీసుకోవడంలో…
ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025లో నంబర్ వన్ ర్యాంక్ ప్లేయర్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్) దూసుకెళ్తున్నాడు. తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ మూడో రౌండ్లోకి ప్రవేశించాడు. రెండో రౌండ్లో 6-0, 6-1, 6-4తో యోషిహిటో నిషియోకా (జపాన్)పై సునాయాసంగా గెలిచాడు. అల్కరాస్ జోరు ముందు తొలి రెండు సెట్లలో తేలిపోయిన జపాన్ ఆటగాడు.. మూడో సెట్లో కాస్త పోటీ ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో స్పెయిన్ ప్లేయర్ 14 ఏస్‌లు, 36 విన్నర్లు కొట్టాడు. అల్కరాజ్ జోరు చూస్తుంటే.. ఆస్ట్రేలియన్ ఓపెన్…
కొత్త ఏడాదిలో గ్రాండ్‌స్లామ్ టోర్నీకి సమయం ఆసన్నమైంది. నేటి నుంచే ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 ఆరంభం అవుతోంది. ఆల్‌టైమ్ గ్రేట్, సెర్బియన్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్ 25వ రికార్డు గ్రాండ్‌స్లామ్‌పై దృష్టి పెట్టాడు. ఈ గ్రాండ్‌స్లామ్ గెలిస్తే టెన్నిస్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు నెగ్గిన ప్లేయర్‌గా జాకో చరిత్ర సృష్టిస్తాడు. ప్రస్తుతం మార్గరెట్ కోర్ట్‌తో సమానంగా టైటిళ్లు 24 సాధించాడు. ఆ ఒక్కటీ గెలవాలన్న జాకో ఆశతో అతడు బరిలోకి దిగుతున్నాడు. చరిత్రకు టైటిల్ దూరంలో ఉన్న…
టెన్నిస్ క్యాలెండర్‌లోని మొదటి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆ్రస్టేలియన్ ఓపెన్ 2025 షెడ్యూల్ గురువారం విడులైంది. జనవరి 12 నుంచి 26 వరకు టోర్నీ సాగనుంది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో తెలుగు మూలాలున్న అమెరికా కుర్రాడు నిశేష్ బసవారెడ్డి బరిలోకి దిగుతున్నాడు. గ్రాండ్‌స్లామ్ అరంగేట్రంలోనే దిగ్గజ ఆటగాడు నొవాక్ జకోవిచ్‌తో పోటీపడబోతున్నాడు. 19 ఏళ్ల నిశేష్ వైల్డ్ కార్డుతో గ్రాండ్‌స్లామ్ అరంగేట్రం చేయనున్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను రికార్డు స్థాయిలో 10 సార్లు గెల్చుకున్న జొకో ముందు బసవారెడ్డి ఎలా నిలబడనున్నాడో…