Australian Open 2025: దూసుకెళ్తున్న అల్కరాస్.. యుకి, బోపన్న జోడీలు ఔట్!
- మూడో రౌండ్లోకి అల్కరాస్
- గాఫ్, సబలెంక ముందుకు
- యుకి, బోపన్న జోడీలు ఔట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025లో నంబర్ వన్ ర్యాంక్ ప్లేయర్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్) దూసుకెళ్తున్నాడు. తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ మూడో రౌండ్లోకి ప్రవేశించాడు. రెండో రౌండ్లో 6-0, 6-1, 6-4తో యోషిహిటో నిషియోకా (జపాన్)పై సునాయాసంగా గెలిచాడు. అల్కరాస్ జోరు ముందు తొలి రెండు సెట్లలో తేలిపోయిన జపాన్ ఆటగాడు.. మూడో సెట్లో కాస్త పోటీ ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో స్పెయిన్ ప్లేయర్ 14 ఏస్‌లు, 36 విన్నర్లు కొట్టాడు. అల్కరాజ్ జోరు చూస్తుంటే.. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఖాతాలో పడడం ఖాయంగా ఉంది.
టెన్నిస్ దిగ్గజం, సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్ మూడో రౌండ్లో అడుగుపెట్టాడు. రెండో రౌండ్లో 6-1, 6-7 (4), 6-3, 6-2తో జైమీ ఫారియా (పోర్చుగల్)పై గెలిచాడు. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓ సెట్‌ను కోల్పోయిన జకో.. ఆపై పుంజుకుని విజయం సాధించాడు. కెరీర్‌లో జకోవిచ్‌కు ఇది 430వ మ్యాచ్. దీంతో అత్యధిక గ్రాండ్‌స్లామ్ మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా జకో రికార్డు సృష్టించాడు. రోజర్ ఫెదరర్ (429)ను జకో అధిగమించాడు. ఇక రెండో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ) 6-1, 6-4, 6-1తో మార్టినెజ్ (స్పెయిన్)పై విజయం సాధించాడు.
Also Read
- Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
- MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
మహిళల సింగిల్స్‌లో మూడో సీడ్ గాఫ్ మూడో రౌండ్లో అడుగుపెట్టింది. రెండో రౌండ్లో 6-3, 7-5తో బురాగె (బ్రిటన్)పై గెలిచింది. ఏడో సీడ్ పెగులా (అమెరికా) 6-4, 6-2తో మెర్టెన్స్ (బెల్జియం)ను ఓడించింది. ప్రపంచ నంబర్‌వన్ సబలెంక (బెలారస్) రెండో రౌండ్లో 6-3, 7-5తో బౌజాస్ మనీరో (స్పెయిన్)పై విజయం సాధించింది. ఒసాకా (జపాన్) 1-6, 6-1, 6-3తో ముచోవా (చెక్)పై, పవ్లిచెంకోవా (రష్యా) 7-6 (7-2), 6-2తో పొటపోవా (రష్యా)పై గెలుపొందారు. భారత ఆటగాళ్లు యుకి బాంబ్రి, రోహన్ బోపన్న డబుల్స్‌లో తొలి రౌండ్ దాటలేకపోయారు.
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్‌ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!