Is Mitchell Marsh Captain of Australia T20 Team: వెస్టిండీస్ మరియు అమెరికాలో జరిగే టీ20 ప్రపంచకప్ 2024కి ముందు ఆస్ట్రేలియా జట్టుకు కొత్త కెప్టెన్ వచ్చే అవకాశం ఉంది. రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ స్థానంలో ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్‌కు జట్టు పగ్గాలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. మార్ష్‌కు టీ20 పగ్గాలు ఇవ్వాలని ఆస్ట్రేలియా హెడ్ కోచ్ ఆండ్రూ మెక్ డొనాల్డ్.. క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)పై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. టీ20 జట్టు బాధ్యతలు వదులుకునేందుకు ప్యాట్ కమిన్స్ కూడా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
మిచెల్ మార్ష్ సారథ్యం కోడం కోచ్ ఆండ్రూ మెక్ డొనాల్డ్ మొగ్గు చూపేందుకు కారణం లేకపోలేదు. ఆరోన్ ఫించ్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాక జరిగిన సిరీస్‌లలో ఆస్ట్రేలియాను మార్ష్ విజయపథాన నడిపించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను మార్ష్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా క్లీన్ స్వీప్ చేసింది. ఆపై విండీస్‌తో జరిగిన సిరీస్‌ను 2-1 తేడాతో, న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌ను 3-0 తేడాతో ఆసీస్ గెలుచుకుంది.
Also Read: Mrunal Thakur: బంపర్ ఆఫర్ కొట్టేసిన మృణాల్ ఠాకూర్.. పాన్ ఇండియా స్టార్‌కు జోడీగా!
వన్డే ప్రపంచకప్ 2023 ముగిసిన వెంటనే భారత్ సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకున్న మిచెల్ మార్ష్.. దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ మరియు న్యూజిలాండ్‌లతో జరిగిన టీ20 సిరీస్‌లలో జట్టును నడిపించాడు. మార్ష్‌కు ఉన్న ఈ రికార్డే టీ20 జట్టు కెప్టెన్ రేసులో ఉంచింది. వన్డే ప్రపంచకప్ అందించిన ప్యాట్ కమిన్స్‌పై సీఏ వేటు వేస్తుందో లేదో చూడాలి. కెరీర్‌లో 54 టీ20లు ఆడిన మార్ష్ 1432 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 17 వికెట్లు పడగొట్టాడు. జూన్ 1 నుంచి టీ20 ప్రపంచకప్ 2024 ప్రారంభంకానుంది.